తెలంగాణ అభివృద్ధి బాగుంది.. కర్ణాటక వ్యవసాయ మంత్రి ప్రశంస

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్​శివారు రాజేంద్ర నగర్‌లోని నేషనల్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​అగ్రికల్చర్​ఎక్స్​టెన్షన్​మేనేజ్​మెంట్‌లో ‘మేనేజ్’ అగ్రి ఫిలిం ఫెస్టివల్-2022ను శనివారం నిర్వహించారు.

Update: 2022-03-13 06:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్​శివారు రాజేంద్ర నగర్‌లోని నేషనల్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​అగ్రికల్చర్​ఎక్స్​టెన్షన్​మేనేజ్​మెంట్‌లో 'మేనేజ్' అగ్రి ఫిలిం ఫెస్టివల్-2022ను శనివారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 11 భాషల్లో వ్యవసాయ అంశాలకు సంబంధించి 270కి పైగా షార్ట్​ఫిలిం ఎంట్రీలు వచ్చినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. అందులో ఉత్తమమైన షార్ట్​ఫిలింలను ఎంపిక చేసి కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. తెలుగులో కాషాయాలు ద్రవణాలు అనే షార్ట్​ఫిలింకు జ్యూరీ ఫస్ట్​ప్రైజ్​రాగా, తెలంగాణలోని డ్రిప్​ఇరిగేషన్‌పై రూపొందించిన మరో షార్ట్​ఫిలింకు జ్యూరీ థర్డ్​ప్రైజ్​వచ్చింది. బెస్ట్​షార్ట్​ఫిలింగా ఇంగ్లిష్​భాషలో రూపొందించిన స్మార్ట్ ఖేతీ అప్నా ఖుషీయా ఎంపికైంది.

ఈ సందర్భంగా కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్​మాట్లాడుతూ.. దేశంలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలనే ప్రధాని మోడీ కల త్వరలో నెరవేరబోతోందని అన్నారు. తెలంగాణ విత్తనరంగ అభివృద్ధి బాగుందని ఆయన కొనియాడారు. అనంతంరం వ్యవసాయ, విత్తనరంగ అభివృద్ధిపై అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక వ్యవసాయశాఖ బృందం రాజేంద్రనగర్‌లో విత్తన పరీక్షల ల్యాబ్‌ను, ఆచార్య జయశంకర్ వర్సిటీలోని అగ్రిహబ్‌ను సందర్శించింది. ఈ కార్యక్రమంలో మేనేజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రశేఖర, కర్ణాటక వ్యవసాయ కమిషనర్ నందిని కుమారి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, ఎండీ కేశవులు, టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఎండీ రాములు పాల్గొన్నారు.

Tags:    

Similar News