Om Birla: భారతీయులు ఇలాగే భావిస్తారు.. లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా

గౌహతి: అంతర్జాతీయ వివాదాలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా అన్నారు..latest telugu news

Update: 2022-04-09 10:53 GMT

గౌహతి: అంతర్జాతీయ వివాదాలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా అన్నారు. భారతీయ సాంస్కృతిక నైతికత ప్రపంచాన్ని ప్రపంచ కుటుంబంగా చూస్తుందని చెప్పారు. శనివారం కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ప్రపంచాన్ని భారతీయ సంస్కృతి అంతర్జాతీయ కుటుంబంగా చూస్తుంది. అన్ని అంతర్జాతీయ సమస్యలు మనం చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని నమ్ముతాం.

శాంతి, స్థిరత్వాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. అందువల్ల పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం తరచుగా ఇతర దేశాలతో చర్చలు జరుపుతుంది' అని చెప్పారు. మొదటి సారిగా భారత అతిథ్యమిస్తున్న సమావేశం సభ్య దేశాలు తమ తమ దేశాల్లో ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలో సహాయపడతాయని అన్నారు. దేశీయ సంస్కృతిని ముందు తీసుకువెళ్లడంలో భారత్ పనిచేస్తుందని చెప్పారు. గ్రామ స్థాయి సంస్థలనుంచి పార్లమెంటు ఉన్నత స్థానంలో ఉందని అన్నారు. అన్ని స్థాయిలలో కలిపి 90 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వర్కింగ్ ప్రజాస్వామ్యంగా ఉందని చెప్పారు. దేశంలోని వైవిధ్యం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. 53 సభ్య దేశాల నుండి ప్రతినిధులు భౌతిక లేదా వర్చువల్ మోడ్‌ల ద్వారా ఈవెంట్‌కు హజరయ్యారు.

Tags:    

Similar News