ఓర్లీన్స్ మాస్టర్స్ 2022.. మిథున్ మంజునాథ్‌కు రజతం
న్యూఢిల్లీ : ఫ్రాన్స్ ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ గేమ్స్‌లో ఇండియన్ షట్లర్ మిథున్..latest telugu news
న్యూఢిల్లీ : ఫ్రాన్స్ ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ గేమ్స్‌లో ఇండియన్ షట్లర్ మిథున్ మంజునాథ్ రజతం గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ టోర్నీలో ఫ్రెంచ్ ఆటగాడు టోమా జూనియర్ పోవోవ్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచాడు. అయితే, బ్యాడ్మింటన్ టోర్నీలో వరల్డ్ నంబర్ 79గా కొనసాగుతున్న మిథున్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 32 స్థానంలో కొనసాగుతున్న పోపోవ్‌తో 50 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించాడు. చివరకు 21-11,21-19 సెట్ల తేడాతో పరాజయం పాలై సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. ఇదిలాఉండగా వరల్డ్ టూర్ ఆఫ్ బ్యాడ్మింటన్‌లో మంజునాథ్ ఫైనల్ వరకు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు టాప్ సీడ్ ఇండియన్ షట్లర్ సాయి ప్రణీత్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.