కామన్‌వెల్త్‌లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత మహిళా సైక్లిస్ట్

దిశ, వెబ్‌డెస్క్ : బర్మింగ్‌హోమ్ వేదికగా జరుగుతున్న - Indian cyclist Meenakshi suffers horror crash, gets run over by rival during cycling event at CWG 2022

Update: 2022-08-02 13:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బర్మింగ్‌హోమ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌ మహిళా సైక్లిస్ట్‌ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. సోమవారం సైక్లింగ్‌లో 10 కి.మీ స్ర్కాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న సైక్లిస్ట్ మీనాక్షి.. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే సైకిల్ పైనుంచి జారి పడింది. ఈ ప్రమాదంలో భారత సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. అదే సమయంలో ఆమె వెనుకే వేగంగా దూసుకొచ్చిన న్యూజీల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా.. మీనాక్షి మీద నుంచి సైకిల్‌ను పోనిచ్చి ఆమె సైతం కిందపడింది. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది.. వీరిని ట్రాక్ నుంచి పక్కకు తీసుకువచ్చారు. న్యూజిలాండ్ సైక్లిస్ట్ వెంటనే లేచి నిలబడగా.. భారత సైక్లిస్ట్ మాత్రం నొప్పితో విలవిల్లాడింది. మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాగా ఈ ఈవెంట్‌లో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Similar News