Agnipath Scheme: రెండు లక్షలకు చేరువలో అగ్నిపథ్ దరఖాస్తులు

Indian Air Force Receives Over 1.83 Lakh Applications Under Agnipath Scheme In 6 Days| జూన్ 14న కేంద్రం ప్రభుత్వం 'అగ్నిపథ్' పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకాన్ని వెనకకు తీసుకోవాలని పెద్ద ఎత్తు్న ఆందోళనలు కొనసాగాయి.

Update: 2022-06-29 10:45 GMT
Indian Air Force Receives Over 1.83 Lakh Applications Under Agnipath Scheme In 6 Days
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: Indian Air Force Receives Over 1.83 Lakh Applications Under Agnipath Scheme In 6 Days| జూన్ 14న కేంద్రం ప్రభుత్వం 'అగ్నిపథ్' పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకాన్ని వెనకకు తీసుకోవాలని పెద్ద ఎత్తు్న ఆందోళనలు కొనసాగాయి. అయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జూన్ 24, 2022 నుండి రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అగ్నిప‌థ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ ద‌ళాల్లో స‌ర్వీసుల్లోకి తీసుకోనున్నారు. అయితే అగ్నిపథ్ పథకం ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ కోసం 1.83 లక్షల దరఖాస్తులను స్వీకరించినట్లు భారతీయ వైమానిక దళం వెల్లడించింది. కాగా ఇందులో అభ్యర్థులకు ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. ఈ పథకం ద్వారా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్ని కేడర్‌లలో నాలుగు సంవత్సరాల పదవీకాలానికి మాత్రమే అగ్నివీర్లను నియమించుకుంటారు. ఈ పథకంతో 2022లో దాదాపు 46,000 మంది యువత రిక్రూట్ చేయబడతారని అంచనా వేశారు. ఇకపోతే 'అగ్నిపథ్' దరఖాస్తు ప్రక్రియ జూలై 5 తేదితో ముగియనుంది.

Tags:    

Similar News