భారత్ అకౌంట్‌లో అంతరిక్ష శిథిలాలు ఎన్నంటే.. నాసా వెల్లడించింది ఇదే..
దిశ, వెబ్‌డెస్క్: మనం పంపించే ప్రతి శాటిలైట్, రాకెట్ విడిభాగాలు అన్నీ కూడా అంతరిక్షంలో శిథిలాల క్రమంలో తిరుగుతూ ఉంటాయి. వీటిని తగ్గించేందుకు ప్రతి దేశం
దిశ, వెబ్‌డెస్క్: మనం పంపించే ప్రతి శాటిలైట్, రాకెట్ విడిభాగాలు అన్నీ కూడా అంతరిక్షంలో శిథిలాల క్రమంలో తిరుగుతూ ఉంటాయి. వీటిని తగ్గించేందుకు ప్రతి దేశంలో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్ష శిథిలాల ప్రోగ్రాంను ప్రారంభించారు. ఇందులో అనేక దేశాలు పాలు పంచుకున్నాయి. అయితే తాజాగా ఈ ప్రోగ్రాంలో ఏ దేశ సహకారం ఎంత ఉందనే దానికి సంబంధించి నాసా సరికొత్త జాబితాను విడుదల చేసింది. అంతరిక్షంలో భారత్‌వి ప్రస్తుతం 103 స్పేస్ క్రాఫ్ట్ యాక్టివ్‌లో ఉండగా, భారత్‌కు సంబంధించిన 114 శిథిలాలు అంతరిక్షంలో ఉన్నాయి. అయితే అంతరిక్ష శిథిల విషయంలో భారత్ సహకారం గత 4 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరిందని నాసా పేర్కొంది. గత నాలుగేళ్లలో భారత్‌వి ఈ ఏడాదే అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయని నాసా పేర్కొంది. అయితే 2022 ఫిబ్రవరి 4 నాటికి అంతరిక్షంలో ఉన్న మొత్తం స్పేస్ క్రాఫ్ట్‌లు 8171 కాగా, శిథిలాలు 25,182గా నాసా తెలిపింది.