అమెరికాలో సూర్యుడి ర‌చ్చ‌.. ఎండ‌తో క్రేజీ సెల్ఫీలు.. భారీ ట్రాఫిక్ జామ్! (వీడియో)

ఈ వీడియోను రికార్డ్ చేసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. Huge crowd in New York stopped traffic to capture sunset.

Update: 2022-06-21 11:41 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః సూర్యోద‌యం, సూర్యాస్త‌మ‌యం స‌మ‌యాల్లో భానుడి అందాలు వ‌ర్ణ‌నాతీతంగా క‌నిపిస్తాయి. అందులోనూ చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో సూర్యుడొస్తే అంత‌కంటే అదృష్టం మ‌రొక‌టి ఉండ‌ద‌నుకుంటారు. అయితే, అమెరికా ప్ర‌జ‌ల‌కు సూర్య‌డు కొత్తేమీ కాదు. కానీ, ఎందుకో ఈ రోజు మాత్రం న్యూయార్క్ ప్రజలు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌స్తుతానికి ఇదే వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఎండను ఎప్పుడూ చూడ‌న‌ట్లు, ఏంటీ ర‌చ్చ‌, జ‌నాలు ఎందుకిలా క్రేజీగా ఫోటోలు తీస్తున్నారంటూ కిరా అనే యువ‌తి ఈ వీడియోను త‌న కారులో నుండి రికార్డ్ చేసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.


"న్యూయార్క్ నగరం నిజం కాదు," అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోకు అత్యధికంగా 10.7 మిలియన్ల వ్యూవ్స్ రాగా, చూసిన నెటిజన్లు ఏం జ‌రుగుతుందో అర్థంకాక గందరగోళం ప‌డ్డారు. అదే సమయంలో అస‌లు విష‌యం తెలిసి ఆనందించారు. అదేంటంటే, రద్దీగా ఉండే మాన్‌హట్టన్ రోడ్‌లో వీళ్లంతా అందమైన సూర్యాస్తమయాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే, అసాధార‌ణంగా ఇక్క‌డ భారీగా జ‌నాలు కూడి, ఫోటోలు తీయ‌డం కాస్త ఆశ్చ‌ర్యం క‌లిగించింది. 


Similar News