Janhvi Kapoor: నేను బతుకుతాను అనే అనుకుంటున్నాను.. జాన్వీ షాకింగ్ పోస్ట్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-10-11 10:09 GMT
Janhvi Kapoor: నేను బతుకుతాను అనే అనుకుంటున్నాను.. జాన్వీ షాకింగ్ పోస్ట్
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇటీవల కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ (Devara)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు చేసింది ఒక్క మూవీ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ సొంతం చేసుకుంది. దేవర విడుదల కాకుండానే టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 లో చాన్స్ దక్కించుకోవడంతో పాటు మరో రెండు మూడు ఆఫర్లు కొట్టేసింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) హీరోగా నటించగా.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌(Nandamuri Kalyan Ram)లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిలత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. అయితే ‘దేవర’(Devara) మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ. 460 కోట్లకు పైగా వసూలు చేసింది.

అయితే ఈ సినిమా విడుదలై 14 రోజులు అవుతున్నా బాక్సాఫీసు వద్ద హవా తగ్గడం లేదు. ఈ క్రమంలో.. తాజాగా, జాన్వీ కపూర్(Janhvi Kapoor) దేవర లోని చుట్టమల్లె సాంగ్ షూట్ చేస్తున్న సమయంలోని వర్కింగ్ వీడియోలు షేర్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సముద్రపు ఒడ్డున నిల్చొని ‘‘నేను పోస్ట్ చేయొచ్చేమో. జెల్లి ఫిష్(Jelly fish) ఉన్న నీళ్లలోకి వెళ్తున్నాను. మామూలు సన్నని చీర మాత్రమే నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నేను బతుకుతాను అనే అనుకుంటున్నాను. ఇది నాకు గుర్తుండిపోయే షాట్ కూడా అవ్వొచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ చూసిన వారు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆ సాంగ్ కోసం ఇంతలా కష్టపడిందా అని షాక్ అవుతున్నారు.

Full View

Tags:    

Similar News