బీపీ, షుగర్‌లలో హైదరాబాదీలే టాప్! ఆ స్క్రీనింగ్‌లో అధికారులకు షాక్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాదీలను బీపీ, షుగర్వ్యాధులు వేధిస్తున్నాయి. Latest Telugu News
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాదీలను బీపీ, షుగర్వ్యాధులు వేధిస్తున్నాయి. 46,909 మందికి చక్కెర వ్యాధి కన్ఫామ్కాగా, 1,38,218 మంది అనుమానితుల శాంపిల్స్ టెస్టింగ్ ప్రాసెస్‌లో ఉన్నాయి. వీరిలో 99 శాతం మందికి వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉన్నదని స్వయంగా డాక్టర్లు చెబుతున్నారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని 1,56,361 మందిలో హైపర్ టెన్షన్ వ్యాధిని గుర్తించారు. మానసిక ఒత్తిడి, జీవన శైలీలో మార్పులే ప్రధాన కారణంగా డాక్టర్లు పేర్కొంటున్నారు. ఆ తర్వాత స్థానంలో ఖమ్మం జిల్లాలో 37,658 మందికి షుగర్వ్యాధి ఉన్నట్లు గుర్తించగా, సంగారెడ్డిలో 72, 208 మందికి హైపర్ టెన్షన్ అధికంగా ఉన్నట్లు తేల్చారు.
79 శాతం మందికి స్క్రీనింగ్..
రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3కోట్ల 76 లక్షల 26 వేల 469 మంది ఉండగా, కోటి 37 లక్షల 36,794 మందికి ఎన్‌సీడీ(నాన్కమ్యునికేబుల్డీసీజెస్) స్క్రీనింగ్చేయాలని వైద్యశాఖ లక్ష్యం పెట్టుకున్నది. వీరిలో 1,08,41,495 మందికి ఎన్‌సీడీ స్క్రీనింగ్నిర్వహించగా, 5,94,863 మందికి షుగర్,12,95,146 మందిలో హైపర్టెన్షన్ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే మరో 21,05,182 మందిలో షుగర్ ఉన్నట్లు అనుమానం రావడంతో స్థానిక మెడికల్స్టాఫ్శాంపిళ్లు సేకరించి ల్యాబ్ లకు పంపించారు. వీరిలో 90 శాతం మందికి తప్పనిసరిగా షుగర్ ఉంటుందని ఎన్‌సీడీ స్కీనింగ్నిర్వహించిన డాక్టర్లు పేర్కొంటున్నారు. అలాంటి లక్షణాలు తేలడంతోనే శాంపిళ్లు తీసుకున్నామని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రంలో ఇటీవల ఎన్‌సీడీ స్క్రీనింగ్నిర్వహించారు. జిల్లాల వారిగా శాంపిళ్లు సేకరించి టెస్టులు చేశారు. ఫలితాలను చూసి అధికారులు కూడా షాకయ్యారు. గత రెండేళ్లతో పోల్చితే షుగర్వ్యాధి 6 శాతం పెరుగగా, హైపర్ టెన్షన్ ఏకంగా 20 శాతం పెరిగింది. జిల్లాల వారీగా డేటాను వైద్యశాఖ ప్రభుత్వానికి అందజేసింది. ఆ డేటా ప్రకారం త్వరలో బీపీ, షుగర్వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకమైన మందులతో కూడిన కిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాస్తవానికి గతంలోనే కిట్లు ఇవ్వాలని నిర్ణయించగా, స్పష్టమైన డేటా లేనందున అప్పట్లో ఆ ప్రోగ్రాం పెండింగ్‌లో పడిపోయింది. దీంతో త్వరలో కిట్ల పంపిణీని షురూ చేసేందుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు.
షుగర్, హైపర్ టెన్షన్ ఎక్కువున్న జిల్లాలు(పేషెంట్ల సంఖ్య)
జిల్లా షుగర్ హైపర్‌టెన్షన్
హైదరాబాద్ 46,909 1,56,361
ఖమ్మ 37,658 61,656
సంగారెడ్డి 31,685 72,208
వరంగల్అర్బన్ 30,122 66,514
నల్లగొండ 29,117 38,508
నిజామాబాద్ 28,284 56,304