Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ (పోస్ట్)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-29 10:14 GMT
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ (పోస్ట్)
  • whatsapp icon

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ పవన్, డైరెక్టర్ జ్యోతి కృష్ణ(Jyoti Krishna) కాంబోలో ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veeramallu)చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్(Mega Surya Productions), ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. అయితే ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్(Anupam Kher), అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫఖ్రీ కీలక పాత్రలో కనిపించనున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu)మూవీ మార్చి(March) 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ‘హరి హర వీరమల్లు’ కౌంట్ డౌన్ పోస్టర్‌ను ‘X’ వేదికగా షేర్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా ఇచ్చారు.150 రోజుల్లో ఈ సినిమా థియేటర్స్‌లోకి రాబోతుందంటూ రెండు డిఫరెండ్ షేడ్స్‌లో ఉన్న లుక్ షేర్ చేశారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం ఫస్ట్ సింగిల్(First Single) అనౌన్స్‌మెంట్ పోస్టర్ కోసం వేచి ఉండాలని తెలిపారు. ప్రజెంట్ పవన్(Pawan Kalyan) లుక్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Click Here For Twitter Post..

Tags:    

Similar News