యోగా టిప్.. వృక్షాసనం ఎలా వేయాలి?

దిశ, ఫీచర్: వృక్షాసనం వేసేందుకు ముందు సమస్థితిలో నిలబడాలి. ఆ తర్వాత కుడి కాలిపై.. Latest Telugu News..

Update: 2022-03-20 05:02 GMT

దిశ, ఫీచర్స్: వృక్షాసనం వేసేందుకు ముందు సమస్థితిలో నిలబడాలి. ఆ తర్వాత కుడి కాలిపై బలంగా నిలబడి ఎడమ కాలు మడిచి మడిమను కుడి తొడకు మూలస్థానం వద్ద అదిమి పట్టి ఉంచాలి. పాదం భూమికి లంబంగా నేల వైపు ఉండేలా చూడాలి. అలాగే బ్యాలెన్స్ చేస్తూ చేతులను పైకెత్తి నమస్కారం చేస్తున్నట్లుగా ఉంచాలి. ఈ పొజిషన్‌లో నార్మల్‌గా శ్వాసతీసుకోవాలి. కాసేపు ఇలాగే ఉన్న తర్వాత నెమ్మదిగా చేతులు, కాళ్లను ఫ్రీ చేసుకోవాలి. తర్వాత ఎడమకాలి పాదంతో కూడా పది సెకన్ల పాటు ఇలాగే చేయాలి.

ఉపయోగాలు:

* కాళ్లు, పాదాలు, మడమలు, మోకాళ్లు, వెన్నుపూస కండరాలు బలంగా తయారవుతాయి.

* సయాటికా నరాల సమస్య నయమవుతుంది.

* ఏకాగ్రత పెరుగుతుంది.

Tags:    

Similar News