అర్థ్రరైటిస్ తో బాధపడుతున్నారా?.. ఈ ఆసనంతో సమస్యకు చెక్..
దిశ, ఫీచర్స్: కటి చక్రాసనం వేసేందుకు చదునైన నేలపై రెండు పాదాలు దగ్గరగా ఉంచి.. Latest Telugu News..
దిశ, ఫీచర్స్: కటి చక్రాసనం వేసేందుకు చదునైన నేలపై రెండు పాదాలు దగ్గరగా ఉంచి నిటారుగా నిల్చోవాలి. తర్వాత రెండు పాదాలను ఒకటిన్నర అడుగు దూరంగా ఉంచి రెండు చేతులను ముందుకు చాచాలి. చేతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు గాలి దీర్ఘంగా పీల్చుకొని నెమ్మదిగా వదులుతూ ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. పాదాలను కదల్చకుండా కుడిభుజాన్ని వెనుకకు మడవాలి. అలా కుడిచేతిని వీపుపై నుంచి ఎడమవైపు నడుము భాగంలో పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనంలో 10 సెకన్ల పాటు ఆగి గాలి పీల్చుకుంటూ ముందుకు తిరగాలి. అలాగే పైన చెప్పిన విధంగా కుడిచేతితో ప్రయత్నించాలి. మొత్తంగా ఇరువైపుల 10సార్లు చేస్తే మేలు.
ఉపయోగాలు :
* తొడలు, నడుము భాగంలో అదనపు కొవ్వు కరుగుతుంది.
* ఆర్థ్రరైటిస్ ఉన్నవారికి చాలా మంచిది.
* పక్కటెముకలు, భుజాలకు మంచి వ్యాయామం.