Parivrtta Surya Yantrasana: పరివృత్త సూర్య యంత్రాసనం ప్రయోజనాలు ఇవే?
How to do Parivrtta Surya Yantrasana Yoga and it's benefits| మొదటగా బల్లపరుపు నేలపై రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. ఎడమకాలు నేలపై ఆన్చి మడమను పిరుదులకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. కుడికాలు పాదం మాత్రమే నేలపై ఉంచి మోకాలు నిటారుగా ఉంచాలి.
దిశ, ఫీచర్స్: How to do Parivrtta Surya Yantrasana Yoga and it's benefits| మొదటగా బల్లపరుపు నేలపై రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. ఎడమకాలు నేలపై ఆన్చి మడమను పిరుదులకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. కుడికాలు పాదం మాత్రమే నేలపై ఉంచి మోకాలు నిటారుగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడి కాలును పైకి లేపుతూ కుడి భుజం మీదుగా తీసుకెళ్లి ఆన్చాలి. తర్వాత శరీర బరువును కంట్రోల్ చేసేందుకు కుడి అరచేతిని, పిరుదులను బలంగా నేలపై ఆన్చాలి. అలా కుదురుకున్నాక ఎడమ చేతితో కుడి పాదాన్ని పట్టుకుని నెమ్మదిగా తలపైభాగంలోకి తీసుకురావాలి. ఈ పొజిషన్‌లో కుడి కాలు బొటనవేలు, తల ఆకాశంవైపు ఉండేలా చూసుకుని, ఎడమ చేతితో కాలును లాగాలి. కుడి చేతిని నిటారుగా పెట్టాలి. ఎడమకాలు కదలకుండా కూర్చోవాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి మళ్లీ ఎడమ కాలుతో చేయాలి.
ప్రయోజనాలు:
* రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
* హిప్ ఫ్లెక్సర్‌లను స్ట్రెచ్ చేస్తుంది.
* కోర్ స్ర్టెంత్ పెరుగుతుంది.
* నడుము, తొడ కండరాలకు మేలు.