Garbhasana Yoga: గర్భాసనం ఎలా చేయాలి? ఉపయోగాలేంటి?

How to do Garbhasana Yoga and benefits| మొదటగా బల్లపరుపు నేలపై మ్యాట్ వేసుకుని దానిపై పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత ఎడమ చేతిని కుడి పాదం, ఎడమ పిక్క మధ్యలో నుంచి.. కుడి చేతిని కుడి పిక్క

Update: 2022-06-20 04:37 GMT

దిశ, ఫీచర్స్: How to do Garbhasana Yoga and benefits| మొదటగా బల్లపరుపు నేలపై మ్యాట్ వేసుకుని దానిపై పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత ఎడమ చేతిని కుడి పాదం, ఎడమ పిక్క మధ్యలో నుంచి.. కుడి చేతిని కుడి పిక్క, ఎడమపాదం మధ్యనుంచి పెట్టి నేలపై అరచేతులను ఆన్చాలి. ఇప్పుడు మోచేతుల్ని కొంచెం ముందుకు జరిపి శరీర భారమంతా పిరుదుల మీద మోపుతూ కాళ్లను మడిచి పైకి లేపాలి. తర్వాత కుడి అరచేతిని కుడి బుగ్గకు, ఎడమ అరచేతిని ఎడమ బుగ్గకు గట్టిగా ఆనించాలి. ఈ భంగిమలో ఉన్నపుడు శరీర బరువంతా పిరుదుల మీదనే ఉండాలి. ఎటూ కదలకుండా కూర్చోవాలి. శ్వాస సామాన్య స్థితిలో ఉండాలి. అధిక పొట్ట కలిగినవారికి ఇది కఠినమైన ఆసనం.

ప్రయోజనాలు:

* పిక్కలు, తొడలు, పిరుదులు శక్తి పొందుతాయి.

* హెర్నియా వ్యాధికి ఈ ఆసనం ప్రయోజనకారి.

* మూత్రేంద్రియ వ్యాధులు నయమవుతాయి.

* స్త్రీల ఋతుస్రావానికి మేలు చేస్తుంది.

Tags:    

Similar News