బాడీ, బ్రెయిన్‌కు పంపే సిగ్నల్ బ్రేకింగ్‌ వర్క్..

దిశ, ఫీచర్స్: 'పెయిన్' అనేది ప్రొటెక్టివ్ కాల్. టిష్యూ డ్యామేజ్‌ను శరీరం పసిగట్టి, నొప్పికి సంబంధించిన సిగ్నల్స్‌ను మెదడుకు చేరవేస్తుంది..Latest Telugu News

Update: 2022-07-12 03:37 GMT

దిశ, ఫీచర్స్: 'పెయిన్' అనేది ప్రొటెక్టివ్ కాల్. టిష్యూ డ్యామేజ్‌ను శరీరం పసిగట్టి, నొప్పికి సంబంధించిన సిగ్నల్స్‌ను మెదడుకు చేరవేస్తుంది. ఆసక్తికరంగా దెబ్బతినే రకాన్ని బట్టి మెదడు వివిధ నొప్పి సంకేత మార్గాలను ఉపయోగిస్తుంది. 'పెయిన్‌కిల్లర్స్' ఈ మార్గాలలోని వివిధ భాగాలను పరిష్కరించడం ద్వారా పని చేస్తాయి. కానీ ప్రతి నొప్పి నివారిణి మందు అన్ని రకాల నొప్పులకు పనిచేయదు. అయతే అనేకమైన నొప్పి మార్గాలకు ఖచ్చితమైన 'పెయిన్ కిల్లర్‌' ఏంటో చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న 'పెయిన్‌కిల్లర్స్' ఏ విధంగా పనిచేస్తాయి? ఉత్తమ ఫలితాల కోసం ఎప్పుడు, ఏవి యూజ్ చేయాలి? తెలుసుకుంటే రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంలో నిపుణులు చెబుతున్న మరిన్ని వివరాలు..

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్

గాయం, బెణుకు లేదా ఎముక విరిగిన పరిస్థితిని నయం చేసేందుకు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. దీంతో కణజాలం వాపుతో పాటు ఎరుపెక్కుతుంది. 'నోకిసెప్టర్స్'గా పిలవబడే గాయం ప్రాంతంలోని ప్రత్యేక నరాల కణాలు.. శరీరం ఉత్పత్తి చేసే తాపజనక రసాయనాలను గ్రహించి మెదడుకు నొప్పి సంకేతాలను పంపుతాయి. ఇలాంటి సందర్భాల్లో 'యాంటీ‌ఇన్‌ఫ్లమేటరీ పెయిన్‌కిల్లర్స్' వినియోగిస్తే గాయపడిన ప్రాంతంలో మంటను తగ్గిస్తాయి. ఇవి ముఖ్యంగా మస్క్యులోస్కెలెటల్ ఇంజ్యూరీస్ లేదా ఆర్థరైటిస్ వంటి వాపు వల్ల కలిగే ఇతర నొప్పి సమస్యలకు ఉపయోగపడతాయి.

ఇబుప్రోఫెన్(అడ్విల్, మోట్రిన్), నాప్రోక్సెన్(అలేవ్), ఆస్పిరిన్ వంటి నాన్‌స్టెరాయిడ్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీస్‌(NSAID).. COX అనే ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా నొప్పిని నివారిస్తాయి. ఇది తాపజనక రసాయనాలను ఉత్పత్తి చేసే బయోకెమికల్ క్యాస్కేడ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. క్యాస్కేడ్‌ను బ్లాక్ చేయడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ కెమికల్స్ డిక్రీజ్ అవుతాయి. తద్వారా శరీరం మెదడుకు పంపే పెయిన్ సిగ్నల్స్‌ను తగ్గిస్తుంది. పారాసెటమాల్ అని కూడా పిలువబడే ఎసిటమైనోఫెన్(టైలెనాల్).. NSAIDల వలె వాపును తగ్గించదు. ఇది COX ఎంజైమ్‌లను నిరోధించి, నొప్పి తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పెయిన్‌కిల్లర్స్‌లో ఇతర COX ఇన్హిబిటర్లు, కార్టికోస్టెరాయిడ్స్.. తాపజనక రసాయనాలను లక్ష్యంగా చేసుకుని, ఇనాక్టివేట్ చేసే మందులు ఉన్నాయి.

టాపికల్ మెడికేషన్స్

టాపికల్ మెడికేషన్స్.. కణజాల నష్టాన్ని గుర్తించే ప్రత్యేక నరాల(నోకిసెప్టర్స్)ను లక్ష్యంగా చేసుకుంటాయి. లిడోకాయిన్ వంటి స్థానిక మత్తుమందులు మెదడుకు విద్యుత్ సంకేతాలను పంపకుండా ఈ నరాలను నిరోధిస్తాయి. చర్మంలోని ఇతర సెన్సరీ న్యూరాన్స్ టిప్స్‌‌పై ఉండే ప్రొటీన్ సెన్సార్‌లు కూడా ఈ పెయిన్‌కిల్లర్స్‌కు టార్గెట్‌గా ఉంటాయి. ఇవి ప్రొటీన్‌లను యాక్టివేట్ చేయడం వల్ల డ్యామేజ్-సెన్సింగ్ నర్వ్స్ కార్యకలాపాలను తగ్గించి, నొప్పిని తగ్గించేందుకు కారణమవుతాయి.

ఈ టాపికల్ మెడికేషన్స్.. చర్మంలోని చిన్న నరాలపై పని చేస్తాయి కాబట్టి అవి చర్మాన్ని నేరుగా ప్రభావితం చేసే నొప్పిని తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తాయి. ఉదాహరణకు షింగిల్స్ ఇన్ఫెక్షన్ చర్మంలోని నరాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల అవి ఓవర్‌యాక్టివ్‌ అయిపోయి, మెదడుకు నిరంతరం నొప్పి సంకేతాలను పంపుతాయి. టాపికల్ లిడోకాయిన్ లేదా ఓవర్ డోస్ క్యాప్సైసిన్‌తో ఆ నరాలను సైలెంట్‌గా మార్చడం వల్ల ఈ నొప్పి సంకేతాలను తగ్గించవచ్చు.

నర్వ్ ఇంజ్యూరీ మెడికేషన్స్

సాధారణంగా కీళ్లనొప్పులు, మధుమేహం.. నాడీ వ్యవస్థ పెయిన్ సెన్సింగ్‌ పార్ట్‌ను అతిగా చురుగ్గా మారుస్తాయి. కణజాల నష్టం లేనప్పుడు కూడా పెయిన్ అలారమ్ బెల్స్ మోగిస్తాయి. ఈ పరిస్థితులల్లో 'గబాపెంటిన్ (న్యూరోంటిన్)' వంటి యాంటీపిలెప్టిక్ మెడిసిన్స్.. నరాలలోని ఎలక్ట్రికల్ సిగ్నలింగ్‌ను నిరోధించడం ద్వారా పెయిన్-సెన్సింగ్ సిస్టమ్‌ను అణచివేస్తాయి. అయినప్పటికీ 'గబాపెంటిన్' నాడీ వ్యవస్థలోని ఇతర భాగాలలో నరాల కార్యకలాపాలను తగ్గించి.. నిద్రమత్తు, గందరగోళానికి దారితీస్తుంది. 'డ్యూలోక్సేటైన్', 'నార్ట్రిప్టిలైన్' వంటి యాంటిడిప్రెసెంట్స్.. నొప్పి మార్గాలను నియంత్రించే వెన్నుపాము, మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ను పెంచడం ద్వారా పనిచేస్తాయి. అయితే అవి జీర్ణాశయాంతర ప్రేగులలో రసాయన సంకేతాలను కూడా మార్చే అవకాశముండటంతో కడుపు నొప్పికి దారితీస్తుంది.

ఓపియాయిడ్స్

ఓపియాయిడ్స్ అనేది నల్లమందు గసగసాల(opium poppy) నుంచి కనుగొనబడిన లేదా తీసుకోబడిన రసాయనాలు. ప్రారంభ ఓపియాయిడ్స్‌లో ఒకటైన 'మార్ఫిన్' 1800లలో శుద్ధి చేయబడింది. అప్పటి నుంచి ఓపియాయిడ్స్ ఎక్స్‌పాండ్ చేయబడుతూనే ఉన్నాయి. ఈ లిస్ట్‌లో కోడైన్, ట్రామడాల్, హైడ్రోకోడోన్, ఆక్సికోడోన్, బుప్రెనార్ఫిన్, ఫెంటానిల్ ఉండగా.. ఓపియాయిడ్స్ శరీరం యొక్క ఎండార్ఫిన్ సిస్టెమ్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా నొప్పిని తగ్గిస్తాయి. ఎండార్ఫిన్లు శరీరం సహజంగా ఉత్పత్తి చేసే ఓపియాయిడ్ రకం. ఇది గాయం యొక్క ఇన్‌కమింగ్ సిగ్నల్స్‌ను తగ్గిస్తుంది. 'రన్నర్స్ హై' అని పిలవబడే ఆనంద భావాలను ఉత్పత్తి చేస్తుంది.

శస్త్రచికిత్స తర్వాత విరిగిన కాలు లేదా క్యాన్సర్ నొప్పి వంటి కండరాల గాయాల మాదిరి తీవ్రమైన నొప్పిని తగ్గించగలిగే ఓపియాయిడ్స్.. న్యూరోపాథిక్ ఇంజ్యూరీస్, క్రోనిక్ పెయిన్‌కు పనికిరావు. జీర్ణాశయాంతర ప్రేగు, ఊపిరితిత్తుల వంటి ఇతర అవయవ వ్యవస్థలలో శరీరం ఓపియాయిడ్ గ్రాహకాలను ఉపయోగిస్తుంది కాబట్టి దుష్ప్రభావాలు ఉంటాయి. మలబద్ధకంతో పాటు శ్వాసను అణచివేసి ప్రాణాంతకంగా మారుతాయి. అందుకే ఇవి దీర్ఘకాలిక ఉపయోగం కోసం ఉద్దేశించినవి కావు.


Similar News