లవ్ మ్యారేజ్‌కి గ్రీన్ సిగ్నల్.. ప్రభాస్ పెళ్లిపై హాట్ అప్‌డేట్

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.. Latest Telugu News..

Update: 2022-03-08 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ప్రభాస్ ఒక ఇంటివాడు ఎప్పుడవుతాడని ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తోంది. అయితే తాజాగా ప్రభాస్‌కు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చేసిందట. 'రాధేశ్యామ్' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్ ఈ విషయాన్ని చెప్పాడు. తన ఇంట్లో పెళ్లిపై ఒత్తిడి తెస్తున్నారని, త్వరగా సెటిలై ఫ్యామిలీ స్టార్ట్ చేయమని అంటున్నారని చెప్పాడు. అయితే ప్రభాస్ తండ్రి అత్త శ్యామలా దేవి ఇటీవల మీడియాతో ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు. ప్రభాస్‌కు తన పెళ్లి విషయంలో ఫుల్ ఫ్రీడం ఇచ్చామని, లవ్ మ్యారేజ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెప్పారు. 'ప్రభాస్ పెళ్లి తరచుగా ఇంట్లోని చర్చల్లోకి వస్తుంటుంది. ఒకవేళ ప్రభాస్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా మాకు ఓకే. మా ఫుల్ సపోర్ట్ తనకే ఉంటుంది. ప్రభాస్ ఓకే అంటే చాలు అదే ఇంట్లో పెద్ద పండుగ అవుతుంది' అని అన్నారు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ ఎప్పుడు ఓకే అంటాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News