Venkatesh: హీరో వెంకటేష్, నితిన్ కాంబోలో కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

ప్రస్తుతం, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు

Update: 2024-10-21 09:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు  హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం, ఈ హీరో అనిల్ రావిపూడి మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ మూవీ తర్వాత వెంకీ తమిళ దర్శకుడితో కొత్త సినిమా చేయనున్నాడని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.

త‌మిళ ద‌ర్శ‌కుడు టీ.ఎన్ సంతోష్ డైరెక్షన్ లో ఓ థ్రిల్లర్ కథ తెరకెక్కనుందట. వెంకటేష్ కు స్టోరీ చెప్పడంతో ఓకే చేసినట్టు తెలిసిన సమాచారం. ఇంకోవైపు ఇదే కథ విన్న నితిన్.. తన సొంత ప్రొడక్షన్ శ్రేష్ఠ్ మూవీపై నిర్మిస్తాన‌ని నితిన్ డైరెక్టర్ కి చెప్పినట్లు తెలుస్తుంది. 

ఈ కథ వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా మన ముందుకు రానుంది. దీనిలో వెంకటేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించేబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేయబోతుందంటూ టాక్ బాగా నడుస్తుంది. త్వరలోనే ఈ మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. 


Similar News