గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. అలా చేసిన వారికి రూ. 5వేల నగదు..

చైన్నై: రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సేవలందించడంలో సహయం చేసిన వారికి నగదు పురస్కారం- latest Telugu news

Update: 2022-03-21 17:24 GMT

చైన్నై: రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సేవలందించడంలో సహయం చేసిన వారికి నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారిని అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ సమయంలో ఆసుపత్రులకు తీసుకెళ్లడంలో సాయపడిన వారికి రూ. 5వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా ప్రభుత్వం తరపున అందిస్తామని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి 48 గంటలలోపు ఉచిత వైద్య చికిత్సను అందించే ఇన్నుయిర్ కాప్పోన్ పథకాన్ని తమిళనాడు సీఎం ప్రకటించారు. ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యచికిత్సను అందించి, బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 609 ఆసుపత్రులతో నెట్‌వర్క్‌ ఏర్పర్చామని వీటిలో 408 ప్రైవేట్ ఆసుపత్రులు కాగా, 201 ప్రభుత్వం ఆసుపత్రులు కూడా ఉన్నాయని స్టాలిన్ చెప్పారు. ప్రభుత్వం గుర్తించిన 81 రకాల జీవనదాన ప్రక్రియలలో ఈ పథకం కింద వైద్యసేవలందిస్తారు. బాధితులకు గరిష్టంగా లక్షరూపాయల వరకు చికిత్సకోసం అందిస్తారు. తమిళనాడు ప్రజలకే కాకుండా, రాష్ట్రాన్ని సందర్శించే ఇతరులకు కూడా ఈ ఉచిత వైద్య సేవలను ప్రమాదం జరిగిన 48 గంటల్లోపు అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News