ఆ జిల్లాలో భారీగా గుట్కా పట్టివేత!

Update: 2022-02-16 11:53 GMT

దిశ, నిర్మల్ రూరల్: కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వం నిషేధించిన గుట్కాను నిర్మల్ జిల్లా సోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాం నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా గంజాల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టగా.. ఐచర్ వాహనంలో కర్ణాటకలోని బీదర్ నుంచి మధ్యప్రదేశ్ ఇండోర్ కు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా పట్టుబడిందన్నారు.

మొత్తం 300 బ్యాగులు స్వాధీనం చేసుకోగా. వీటి విలువ సుమారు రూ. 23,76,000 లక్షల వరకు ఉంటుందన్నారు. వాహన డ్రైవర్లు గౌసోద్దీన్, సుబ్బన్నలను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. గుట్కా అమ్మిన, అక్రమంగా రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంతోషం రవీందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News