పుచ్చకాయతో పిజ్జా చేయడం ఎప్పుడైనా చూసారా.. (వీడియో)
దిశ,వెబ్‌డెస్క్: ఆహార ప్రియుల మెనులో పిజ్జా తప్పకుండా ఉంటుంది.
దిశ,వెబ్‌డెస్క్: ఆహార ప్రియుల మెనులో పిజ్జా తప్పకుండా ఉంటుంది. ఈ మధ్య పిజ్జా తినే వారి సంఖ్య బాగా పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు. పిజ్జాలో పలురకాల కూరగాయలతో, పండ్లతో తయారు చేయడం చూస్తున్నాం. ఇటీవల పండ్లతో తయారుచేసిన పిజ్జా టాపింగ్ ట్రెండ్ అవుతుంది. ఇంతకు ముందు పిజ్జాపై ఫైనాపిల్ టాపింగ్స్‌తో కూడిన వీడియోకు ఆహార ప్రియుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఓ వీడియోలో పుచ్చకాయ కట్ చేసి తింటున్నట్లు అనిపిస్తుంది. ఆ తరువాత ఆ పుచ్చకాయను పాన్ మీద కాల్చడం.. దానిపై బార్బెక్యూ సాస్ వేస్తాడు చెఫ్. అంతేకాకుండా టమాటో సాస్ కంటే చాలా రుచిగా ఉంటుందని ఆ వీడియోలో వివరించాడు. చివ్స్, పెప్పరోనీతో సహా గార్నిష్‌లతో టాప్ అప్ చేస్తాడు. దాన్ని కాసేపు వేడి చేసి, కొద్దిసమయంలో తర్వాత దాన్ని బయటకు తీస్తే సేమ్ పిజ్జా లాగా కనిపిస్తుంది.