Sree Vishnu: ‘శ్వాగ్’ మూవీతో శ్రీవిష్ణు మార్కెట్ పెరిగిందా.. తగ్గిందా?

వీకెండ్ ను ఏ మాత్రం కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.

Update: 2024-10-10 11:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : 'రాజ రాజ చోర’ తర్వాత హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘శ్వాగ్’ . ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ పతాకం పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. రీతూ వర్మ  , దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ , శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్స్ మంచి హైప్ ను క్రియోట్ చేసాయి. మొదటి రోజు ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఆశించిన  ఓపెనింగ్స్ అయితే రాలేదు. వీకెండ్ ను ఏ మాత్రం కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. ఆరు రోజుల్లో ఈ మూవీ కేవలం రూ.1.5 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది.

నైజాం - 0.44 CR

సీడెడ్ - 0.11 CR

ఉత్తరాంధ్ర - 0.20 CR

ఈస్ట్ - 0.09 CR

వెస్ట్ - 0.05 CR

గుంటూరు - 0.12 CR

కృష్ణా - 0.18 CR

నెల్లూరు - 0.06 CR

ఏపీ + తెలంగాణ (టోటల్) - 01.25 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.25 CR

వరల్డ్ వైడ్ (టోటల్) - 01.50 CR (షేర్)

ఇలా ఎక్కడ చూసిన కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ మూవీతో శ్రీ విష్ణు మార్కెట్ పెరుగుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఇంకా డౌన్ అయ్యింది. ఇలా చూసుకుంటే, తర్వాత సినిమాలకు రెమ్యునరేషన్ తగ్గినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

Tags:    

Similar News