జవహరీ అఫ్గాన్‌లోనే ఉన్నట్టు తెలియదు : తాలిబన్లు

కాబుల్: అల్‌ఖైదా చీఫ్ జవహరీ మృతి చెందినట్లు సరైన ఆధారాలు లేవని తాలిబన్లు వెల్లడించారు.

Update: 2022-08-04 15:33 GMT

కాబుల్: అల్‌ఖైదా చీఫ్ జవహరీ మృతి చెందినట్లు సరైన ఆధారాలు లేవని తాలిబన్లు వెల్లడించారు. కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీని చంపినట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ విషయంపై గురువారం తాలిబన్లు స్పందించారు. 'జవహరీ అఫ్గాన్‌లోనే ఉన్నట్లు తెలియదు. అతను చనిపోయినట్లు ఆధారాలు కూడా లేవు. అఫ్గానిస్తాన్ నుంచి ఏ దేశానికి ఎలాంటి ముప్పు లేదు.' అని తాలిబన్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జవహారీ మరణంపై విచారణ జరుపుతోందన్నారు. అయితే కాబూల్‌లో జవహరీ మృతికి సంబంధించి డీఎన్ఏ ఆధారాలు కూడా లేవని అమెరికా వెల్లడించింది. తాలిబన్లు, అమెరికా పరస్పర ప్రకటనలతో అల్‌ఖైదా చీఫ్ జవహరీ మృతి చెందారా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. 2011లో యూఎస్ ఫొరెస్స్ ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన తర్వాత అల్‌ఖైదా పగ్గాలను జవహరీ తీసుకున్నాడు.


Similar News