హిందీ తో సహా తొమ్మిది భాషల్లో Google అసిస్టెంట్..

Update: 2022-02-14 15:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ సరికొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టె పనిలో ఉంది. గూగుల్ అసిస్టెంట్‌లో గెస్ట్ మోడ్ రాబోయే నెలల్లో హిందీతో సహా తొమ్మిది అదనపు భాషల్లో అందుబాటులో ఉంటుందని టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. గెస్ట్ మోడ్ అని పిలువబడే Google అసిస్టెంట్ కోసం డానిష్, ఇండోనేషియన్, డచ్, నార్వేజియన్, పోర్చుగీస్ (బ్రెజిల్), స్వీడిష్, థాయ్, మాండరిన్ (తైవాన్), హిందీ భాషలను త్వరలో యాడ్ చేయనుంది. ప్రస్తుతం లాగ్వేజ్ ఆప్షన్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, జర్మన్, జపనీస్, కొరియన్‌ భాషలలో అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్ వ్యక్తిగత సమాచారాన్ని మినహాయిస్తుంది. ఇతర వ్యక్తులు మీ స్మార్ట్ పరికరాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

గత సంవత్సరం గూగుల్ స్మార్ట్ స్పీకర్‌లు లేదా డిస్‌ప్లేలపై నడుస్తున్న Google అసిస్టెంట్‌కి గెస్ట్‌మోడ్‌ను పరిచయం చేసింది. కొత్త భాషలను యాడ్ చేయడం ద్వారా గూగుల్ అసిస్టెంట్‌ మొత్తం 16 భాషలను సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు గూగుల్, ఆన్‌లైన్ భద్రతపై దృష్టి సారించి కొత్త అప్‌డేట్‌లను తీసుకురానుంది. సేఫ్టీ బ్రౌజింగ్ కోసం కూడా మరోక ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి గూగుల్ ప్రయత్నిస్తుంది.

Tags:    

Similar News