Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఈశ్వర్’ రీ రిలీజ్

ఈ సినిమా ట్రైలర్‌ను అద్భుతంగా ఎడిట్ చేశారు.

Update: 2024-10-12 08:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రభాస్ నటించిన సినిమాలు చాలా ఉన్నప్పటికీ మొదటి మూవీ ఈశ్వర్ సినిమాని రిరిలీజ్ చేయాలనీ మేకర్స్ చేయాలనీ భావిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈశ్వర్ మూవీ భారీగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్ .

ఈశ్వర్ సినిమా రీ-రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ను అద్భుతంగా ఎడిట్ చేశారు. ఇందులో ప్రభాస్ భారీ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్ ,ప్రేమ సన్నివేశాలు ఉన్నాయి.

అశోక్ నిర్మించిన ఈశ్వర్ చిత్రానికి జయంత్ కె పరాన్జీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీదేవి కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ రీ-రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు 'ఈశ్వర్' రీ-రిలీజ్‌తో ప్రభాస్ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు.

Full View

Tags:    

Similar News