గోదావరి ఇసుక అక్రమ రవాణా.. బోర్డు సూచికలతో యదేచ్చగా అమ్మకాలు
దిశ, బయ్యారం: మండలంలో ఇసుక దొంగ రావాణా భారీ చేస్తున్నారు. కొంత మంది లారీల ద్వారా.. Latest Telugu News..
దిశ, బయ్యారం: మండలంలో ఇసుక దొంగ రావాణా భారీ చేస్తున్నారు. కొంత మంది లారీల ద్వారా మీ సేవలో అనుమతితో డీడీలు నిర్వహించి గోదావరి ఇసుకను లారీల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బయ్యారం, కొత్తపేట, జగ్గు తండా పంచాయతి పరిదిలలో డంపులు చేసి అక్రమ వ్యాపారం యదేచ్చగా కొనసాగిస్తున్నారు. కొంతమంది లారీ యజమానులు డీడీ అనుమతి ఎక్కడ ఉందో అక్కడ దిగుమతులు చేయకుండా అక్రమంగా డంపులు చేపట్టి బహిరంగంగా బోర్డు సూచికలతో ఇసుక అమ్మబడును అని బహిరంగంగా ట్రాక్టర్లతో కొందరు విక్రయాలు చేపడుతున్నారు.
ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మండలంలో పలువురు విమర్శిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి 14 టైర్ల లారీకి 30 నుండి 40 టన్నుల ఇసుకను మండల కేంద్రానికి రవాణా కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఇసుక డంపుల నిర్వహించే వారు టన్నుకు 12 నుండి 15 వందల వరకు గృహ నిర్మాణదారులకు ఇతర రంగాల వారికి విక్రయిస్తున్నారు. లారి లోడు 40 టన్నుల ఇసుక రూ. 20 నుండి 30 వేలకు కొనుగోలు చేస్తూ డంపులుగా నిల్వలు చేపడుతున్నారు. దీనిపై ఇసుక అక్రమ వ్యాపారులను కట్టడి చేయాల్సిన అధికారులు నోరెత్తకుండా ఉండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పేద వారు నూతన గృహ నిర్మాణం చేపట్టాలంటే ఇసుక డంపులు నిర్వహించే వారు డబుల్ రేట్లకు ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై తహాశీల్దార్ అనంతుల రమేష్‌ను వివరణ కోరగా అక్రమంగా ఇసుక డంపులు చేసి ట్రాక్టర్ల ద్వారా గోదావరి ఇసుక రవాణా చేస్తే మా దృష్టికి తేవాలని అన్నారు. మండలంలో గోదావరి ఇసుకను అనుమతి లేకుండా డంపులు చేయడం నేరమని అన్నారు. అలాంటి డంపులు ఉంటే వాటిని గుర్తించి సీజ్ చేస్తామని అన్నారు.