Pakistan: 'భారత్‌పై ఇష్టముంటే అక్కడికే వెళ్లు'.. పాక్ ప్రధానికి సూచించిన ప్రతిపక్ష నేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్ విపక్ష నేత మరియం నవాజ్ షరీఫ్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర వ్యాఖ్యలు..latest telugu news
ఇస్లామాబాద్: పాకిస్తాన్ విపక్ష నేత మరియం నవాజ్ షరీఫ్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ పై అంత ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లమని అన్నారు. భారత్‌ను ప్రశంసిస్తూ ఇమ్రాన్ వ్యాఖ్యలు చేయడాన్ని శనివారం ఆమె తప్పుబట్టారు. క్రితంరోజు ఓ ప్రసంగంలో ఇమ్రాన్‌ఖాన్ భారత్‌ను ఉద్దేశించి గొప్ప గౌరవం కలిగిన దేశం అని అన్నారు.
అంతేకాకుండా తాను భారత్ కు వ్యతిరేకి కాదని, పొరుగుదేశాన్ని చాలా వరకు అనుసరిస్తానని చెప్పారు. దీనిపై పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియం స్పందించింది. 'ఇమ్రాన్ ఖాన్‌కు పిచ్చి ఎక్కింది. ఈ అధికారాన్ని చూసి పిచ్చెక్కిన వ్యక్తిని తన సొంత పార్టీ వాళ్లే తరిమికొట్టారని ఎవరైనా చెప్పాలి. ఒక వేళ మీరు భారత్ ను అమితంగా ఇష్టపడితే, పాకిస్తాన్ ను వదిలి అక్కడికే వెళ్లాలి' అని సూచించారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ భారత్‌ను ప్రశంసించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ భారత విదేశాంగ పాలసీ విధానంపై ఆయన హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.