రత్నాభరణాల పరిశ్రమకు 100 బిలియన్ డాలర్ల టార్గెట్: పీయూష్ గోయల్!

ముంబై: దేశీయ రత్నాభరణాల ఎగుమతిదారులు రాబోయే సంవత్సరాల్లో..telugu latest news

Update: 2022-03-29 16:25 GMT

ముంబై: దేశీయ రత్నాభరణాల ఎగుమతిదారులు రాబోయే సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్ల(రూ. 7.5 లక్షల కోట్ల) ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ రంగం మెరుగైన ఎగుమతులను సాధించే భారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని, మార్కెటింగ్, అరుదైన డిజైన్‌లను రూపొందించడం ద్వారా ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడానికి వీలవుతుందని పీయూష్ గోయెల్ తెలిపారు. మంగళవారం రత్నాభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుందాం. భారత మొత్తం ఎగుమతుల్లో రత్నాభరణాల పరిశ్రమ 10 శాతం వాటాను కలిగి ఉందన్నారు.

ఇటీవల సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై భారత్, యూఏఈ సంతకాలు చేశాయి. ఇది ప్రస్తుత ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల టెక్స్‌టైల్స్, ఫార్మా, రత్నాభరణాలు, రసాయనాల వంటి రంగాల నుంచి ఎగుమతులకు అవకాశం ఉండనుంది. యూఏఈ, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలతో పాటు పలు ప్రాంతాలకు ఎగుమతులు పెరిగేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని జీజేఈపీసీ ఛైర్మన్ కొలిన్ షా అన్నారు. యూఏఈకి ఎగుమతులు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో దీన్ని రెట్టింపు చేయగలమనే విశ్వాసం ఉందని కొలిన్ షా వెల్లడించారు.

Tags:    

Similar News