జార్జిరెడ్డిని హత్యచేసిన మతోన్మాదమే నేడు రాజ్యమేలుతోంది : పీడీఎస్‌యూ
ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని
దిశ, వెబ్ డెస్క్ : ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం ఈ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ప్రిన్సిపాల్ సుధాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు కంచనపల్లి శ్రీను, వికాస్ మాట్లాడుతూ మతఛాందస, విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాడిన యోధుడు జార్జిరెడ్డి అని గుర్తు చేశారు. నాడు జార్జిని హత్యచేసిన మతోన్మాదమే నేడు అధికారంలో ఉండి విద్యను కాశాయికరిస్తే తప్పేంటని నిసిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేడు జార్జిని స్మరించడమంటే మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడటమేనని, అంతరాలు లేని సమాజం కోసం పోరాడటమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు ఉదయ్, వినయ్, భాస్కర్, క్రాంతి, సబాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.