నాలుగేండ్ల తర్వాత టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ఓపెన్.. వారికి చాన్స్..​

దిశ, తెలంగాణ బ్యూరో: నాలుగేండ్ల నుంచి తాళం వేసిన టీఎస్‌పీఎస్సీ వెబ్​సైట్- latest Telugu news

Update: 2022-03-28 07:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నాలుగేండ్ల నుంచి తాళం వేసిన టీఎస్‌పీఎస్సీ వెబ్​సైట్ ఎట్టకేలకు తెరుస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్​సర్వీస్​కమిషన్​(టీఎస్​పీఎస్సీ) వెబ్​సైట్‌ను ఓపెన్​ చేసింది. 2018 తర్వాత మళ్లీ నాలుగేండ్ల అనంతరం ఈ వెబ్​సైట్​తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ వెబ్​సైట్‌లో రిజిస్ట్రేషన్​ చేసుకున్న అభ్యర్థుల వివరాలను సవరించుకునేందుకు ఇవ్వాల్టి నుంచే అవకాశం కల్పించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వెబ్​సైట్ లాక్​ఓపెన్​కానుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్​చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్​ఇస్తున్నారు. అదే విధంగా కొత్త అభ్యర్థులు కూడా రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు వెబ్​సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు స్థానికతను సవరించుకోవాల్సి వస్తుండటంతో 25 లక్షల మంది అభ్యర్థులు మార్పులు చేసుకోవాల్సి అనివార్యమవుతోంది.

రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలు ప్రస్తుతం 33 జిల్లాలుగా పునర్విభజన చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు అభ్యర్థులు స్థానికతను సవరించుకోవాలని టీఎస్‌పీఎస్సీ వెల్లడిస్తోంది. 33 జిల్లాలు, రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు ఏర్పాటైనందున వాటి ప్రకారం అభ్యర్థులు స్థానికతను ఖరారు చేయాల్సి ఉంది. టీఎస్‌పీఎస్సీ వెబ్​సైట్​ఓపెన్​ చేసుకోగానే.. తమ రిజిస్ట్రేషన్​ వివరాలు నమోదుచేసిన తర్వాత ముందుగా స్థానికత వివరాలను సవరించుకోవాలి. టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన ప్రాంతంతో పాటుగా ప్రస్తుత 33 జిల్లాలకు అనుగుణంగా వివరాలు ఎడిట్​చేయాల్సి ఉంది. అంతేకాకుండా గతంలో నాలుగేండ్ల కిందట నుంచి ఇప్పటి వరకు విద్యార్హతల్లో మార్పులను కూడా సవరించుకోవచ్చు.

ఓటీఆర్‌లో ఎడిట్​ చేయాలనుకుంటే వెబ్​సైట్‌లో ఎడిట్ ఓటీఆర్​అనే దానిపై క్లిక్​చేసి, టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఫోన్​ నెంబర్​ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తోంది. దాన్ని నమోదు చేస్తే రిజిస్ట్రేషన్​ఎడిట్​ ఓపెన్​అవుతోంది. ఓపెన్​అయిన తర్వాత ఎడిట్ చేయాల్సిన వివరాలను కరెక్ట్​గా నమోదు చేసి, 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన జిల్లాలను ఎంపిక చేసి, విద్యార్హతలను నమోదు చేయాలి. అనంతరం అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్​లోడ్​ చేస్తే కొత్త ఓటీఆర్​జనరేట్ అవుతోంది.

కొత్తవారికీ చాన్స్..

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా 30,453 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్​పీఎస్సీ కొత్త అభ్యర్థుల నమోదుకు అవకాశం కల్పించింది. టీఎస్‌పీఎస్సీ వెబ్​సైట్​ఓపెన్ చేయగానే న్యూ రిజిస్ట్రేషన్​ మీద క్లిక్​చేసి, మొబైల్​నెంబర్​ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీని నమోదు చేయాలి. అప్లికేషన్​ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ మెయిల్​ఐడీ, 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన జిల్లాల వివరాలు, విద్యార్హతలను ఎంట్రీ చేయాలి. తర్వాత అభ్యర్థి ఫొటో, సంతకం అప్​లోడ్​చేయాల్సి ఉంటోంది. ఈ వివరాలన్నీ సబ్మిట్​చేసిన తర్వాత టీఎస్​పీఎస్సీ ఐడీ క్రియోట్​అవుతోంది. దాన్ని డౌన్లోడ్​చేసుకోవాలి. అదే నిరుద్యోగులకు ఆధార్​ కార్డు.

Tags:    

Similar News