దేవరకద్ర ఎస్సై పేరుతో డబ్బులు వసూలు.. ఇంతకీ ఎవరు చేశారో తెలుసా

కొత్త ఎస్ఐను అంటూ సైబర్ నేరగాళ్లు ప్రజలతో డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2025-04-26 10:11 GMT
దేవరకద్ర ఎస్సై పేరుతో డబ్బులు వసూలు.. ఇంతకీ ఎవరు చేశారో తెలుసా
  • whatsapp icon

దిశ, దేవరకద్ర : కొత్త ఎస్ఐను అంటూ సైబర్ నేరగాళ్లు ప్రజలతో డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సాంకేతికత పెరుగుతున్నా కొద్ది మోసాలు చేసే విధానం కూడా మారిపోతుంది. సామాన్యులను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పంథాలు వెతుకుతున్నారు. అందులో భాగంగానే దేవరకద్ర ఎస్ఐ పేరుతో ప్రజల నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి మండలంలోని వివిధ గ్రామాల ప్రజల వివరాలు సేకరించి 9959833716 నంబర్ నుండి కాల్స్ చేసి నేను దేవరకద్రకు కొత్తగా వచ్చిన ఎస్ఐని, నా పేరు శ్రీనివాస్ అని చెప్పుకుంటూ నా పై అధికారులకు డబ్బులు అవసరం ఉంది. ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాడు. ఈ విషయం స్థానిక ఎస్సై నాగన్న దృష్టికి రావడంతో సైబర్ నేరగాళ్లు చేసే ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పోలీస్ శాఖ ప్రజలు ఎవరికీ ఎలాంటి డబ్బులు అడగదని ప్రజలు ఇది గుర్తించాలని స్పష్టం చేశారు.

Similar News