సీఎం కేసీఆర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
మహిళల అభివృద్ధికి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం నుంచి గ్రామాల్లో బెల్టుషాపులు,
దిశ, తెలంగాణ బ్యూరో : మహిళల అభివృద్ధికి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం నుంచి గ్రామాల్లో బెల్టుషాపులు, కల్తీకల్లు దుకాణాలను తొలగించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. మంగళవారం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో మద్యానికి బానిసై అనారోగ్యం పాలుకావడంతో పాటు వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు 2500 అధికారిక వైన్ షాపులతో పాటు వేల సంఖ్యలో బెల్టుషాపులు వెలిశాయని వాటిని నియంత్రించాలని కోరారు. అదే విధంగా రాష్ట్రంలో కల్తీ కల్లు నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.