ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ ను సీబీఐ అధికారులు

Update: 2022-03-07 03:59 GMT

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను కో-లొకేషన్ స్కామ్ కేసులో ఆదివారం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. చిత్ర రామకృష్ణ ను ఢిల్లీలో అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం ఆమెను సీబీఐ ప్రధాన కార్యాలయం లాకప్‌లో ఉంచినట్లు వారు తెలిపారు. సీబీఐ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు గ్రిల్ చేసి, ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిందని, ఆమె ఎటువంటి సమాధానం చెప్పడం లేదని అధికారులు తెలిపారు.

అయితే చిత్ర రామకృష్ణ ముందస్తు బెయిల్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించినట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన స్టాక్ బ్రోకర్ పై 2018 నుంచి కో-లోకేషన్ స్కామ్ ను విచారిస్తున్న సీబీఐ, ఎన్ఎస్ఇ లోని అప్పటి ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సెబి నివేదిక చూపించడం తో చర్య తీసుకున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 25న, సిబిఐ మాజీ ఎన్‌ఎస్‌ఇ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అయితే కో-లోకేషన్ స్కాం కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News