2024 ఎన్నికల్లో నిలబడతా.. జేడీ లక్ష్మీనారాయణ
దిశ, ఏపీ బ్యూరో: రాబోయే 2024 ఎన్నికల - Former CBI Jedi Laxminarayan made sensational remarks on the 2024 elections
దిశ, ఏపీ బ్యూరో: రాబోయే 2024 ఎన్నికల బరిలో నిలబడతానని, చట్ట సభలకు తనను పంపితే మహిళా రిజర్వేషన్‌పై పోరాడతానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఆదివారం ఆయన తన పుట్టిన రోజు వేడుకను విజయవాడలోని బావాజీపేటలోని నవజీవన్ బాలభవన్ అనాధ బాలల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే, విద్య, పరిశోధన, వాణిజ్యంతోపాటు రాజకీయ సహకారం కూడా ఎంతో ముఖ్యమన్నారు. కొన్ని చోట్ల భర్త, ఇతరులు అధికారం చెలాయించే దుస్థితి ఉందన్నారు.
రాజకీయ వ్యవస్థ బాగుంటేనే, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని, విద్యార్థులు ప్రశ్నించగా.. తనది సరికొత్త ప్రజల పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. యువతరం చదువులు చదివి, ఉన్నత స్థానాలను అదిరోహించి, దేశాభివృద్ధికి రాజకీయ తోడ్పాటు కూడా అందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర నాయకులు పోతిన వెంకట రామారావు, నవజీవన్ బాల భవనం ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫాదర్ అంతయ్య, ఫాదర్ ఇగ్నిషియస్, పీఆర్ఓ మస్తాన్ పాల్గొన్నారు.