40 ఏళ్లుగా ఒకే రకమైన ఫొటో.. వయసు పెరిగింది కానీ పోజ్ మారలే!
దిశ, ఫీచర్స్ : 1982లో కాలిఫోర్నియా-ఒరెగాన్ సరిహద్దులోని కాప్కో లేక్ వద్ద ఓ ఐదుగురు స్నేహితులు కలిసి ఒక గ్రూప్ ఫొటో దిగారు.
దిశ, ఫీచర్స్ : 1982లో కాలిఫోర్నియా-ఒరెగాన్ సరిహద్దులోని కాప్కో లేక్ వద్ద ఓ ఐదుగురు స్నేహితులు కలిసి ఒక గ్రూప్ ఫొటో దిగారు.ఆ తర్వాత ఐదేళ్లకు మళ్లీ అదే ప్రదేశంలో, అదే పోజులో మరో ఫొటో దిగారు. ఆపై ప్రతీ ఐదేళ్లకోసారి ఆ ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేయడం, సేమ్ స్టైల్‌లో ఫొటో దిగడం వాళ్లకు పరిపాటిగా మారింది. ఇలా 40 ఏళ్లుగా తమ ఫొటో సీన్ రిపీట్ అవుతుండటం విశేషం.
శాంటా బార్బరా హైస్కూల్ గ్రాడ్యుయేట్స్ అయిన ఐదుగురు స్నేహితులు 1982లో ఆటోమేటిక్ కెమెరా టైమర్‌తో ఓ ఫొటో తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్లకు అదొక ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే తమ ఫొటో ప్రముఖ 'కాస్ట్‌కో మ్యాగజైన్'లో ప్రదర్శితమైంది. నెట్టింట కూడా ఆ ఫొటో వైరల్‌గా మారడంతో తమ ఫ్రెండ్‌షిప్ గురించి నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మిత్రుల వయసు ప్రస్తుతం 59 ఏళ్లు కాగా అందులో డిక్సన్ ఒక్కడే ఇప్పటికీ శాంటా బార్బరాలో నివసిస్తూ అక్కడ ఒక వెబ్‌సైట్ నడుపుతున్నాడు. మిగతా వారిలో మెలోని న్యూ ఓర్లీన్స్‌లో, రూమర్-క్లియరీ ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో, వార్డ్‌లా ఒరెగాన్‌లోని బెండ్‌లో ఉంటున్నారు.
మేమంతా కలిసి చేపలు పట్టాం. బార్బెక్యూ చేశాం. అర్థరాత్రి గోడలపై కొట్టడం, పటాకులు గదిలోకి విసిరివేయడం, నిద్రపోతున్న వారిని డిస్టర్బ్ చేయడం వంటి చిలిపి పనులెన్నో చేశాం. మేం కలుసుకున్న రోజులను ఎంతో సంతోషంగా గడుపుతాం. ఒకరికొకరం నిక్‌నేమ్స్ పెట్టుకుని ఏడిపిస్తూ ఉంటాం. ఏదేమైనా మా యవ్వనాన్ని గుర్తుచేసే ఫొటోను కాపీ చేస్తూ మరొక ఇమేజ్‌ను మా లైఫ్ డైరీకి యాడ్ చేస్తాం. మీరు ఫొటోను పరిశీలిస్తే రూమర్-క్లియరీ ల్యాప్ లేదా మోకాలిపై ఎప్పుడూ ఒక టోపీ ఉంటుంది. ఇక మెలోనీ తన కుడి చేతిలో ఒక గాజు సీసా పట్టుకుంటాడు. బర్నీ కుడి చేయి అతని కుడి మోకాలిపైన ఉంటుంది' అని స్నేహితులు తమ అనుభవాలను పంచుకున్నారు.