మొట్టమొదటి క్విజ్ మాస్టర్ ఎవరో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: కలకత్తాకు చెందిన ఆంగ్లో ఇండియన్ 'నీల్ అలోయ్‌సియన్ ఓబ్రీన్'.. భారతదేశంలో మొదటిసారిగా క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. విద్యావేత్తగా, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నాయకుడిగా పనిచేసిన ఆయన క్విజ్ మాస్టర్‌గానే ఈ లోకానికి సుప్రసిద్ధుడు..Latest Telugu News

Update: 2022-06-24 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలకత్తాకు చెందిన ఆంగ్లో ఇండియన్ 'నీల్ అలోయ్‌సియన్ ఓబ్రీన్'.. భారతదేశంలో మొదటిసారిగా క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. విద్యావేత్తగా, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నాయకుడిగా పనిచేసిన ఆయన క్విజ్ మాస్టర్‌గానే ఈ లోకానికి సుప్రసిద్ధుడు. కాగా ఇంగ్లాండ్‌లో విద్యాభ్యాసం తర్వాత 1967లో ఇండియాకు వచ్చిన నీల్.. మొదటి సారి కోల్‌కత్తాలోని క్రైస్ట్ ది కింగ్ చర్చిలో 'క్విజ్ షో'ను నిర్వహించాడు. మొదట కలకత్తాలోని ఆంగ్లో ఇండియన్లను మాత్రమే ఆకర్షించిన ఈ క్విజ్ కార్యక్రమాలు క్రమేపీ.. చిన్నా పెద్ద తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్నాయి.

దీంతో రేడియో, టెలివిజన్‌లలో క్విజ్ కార్యక్రమాలను నడిపిన నీల్.. అనతికాలంలోనే దేశంలోని పలు దినపత్రికలలో క్విజ్‌కు సంబంధించిన అనేక శీర్షికలను నిరంతరంగా నిర్వహించాడు. అంతేకాదు బ్రిటిష్, అమెరికా క్విజ్ ప్రొగ్రామ్స్‌కు భిన్నంగా భారతీయులకు సరిపోయే విధంగా నిర్వహించడం విశేషం. ఇక ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఇండియా)కు మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆల్ ఇండియా ఆంగ్లో ఇండియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ప్రాంక్ ఆంథోని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్‌గా సేవలందించిన ఆయన.. 82ఏళ్ల వయసులో 2016 జూన్ 24న కన్నుమూశాడు.


Similar News