కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: సంకినేని

దిశ, మద్దిరాల: రాష్ట్రంలో నయా నిజాం లా వ్యవహరిస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తున్న సీఎం latest telugu news..

Update: 2022-03-09 12:03 GMT

దిశ, మద్దిరాల: రాష్ట్రంలో నయా నిజాంలా వ్యవహరిస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని చందుపట్ల గ్రామస్తులు వివిధ పార్టీలకు చెందిన 20 కుటుంబాలు బెజ్జంకి సోమిరెడ్డి ఆధ్వర్యంలో సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వణుకు పుడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ కడియం రామచంద్రయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కాపా రవికుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ రమేష్. మండల పార్టీ అధ్యక్షులు భూతం సాగర్. బీజేపీ నాయకులు విక్రమ్, యాటకారి మహేష్, బ్రహ్మ దేవర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News