దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఫేక్డాక్టర్ల స్కామ్బయటపడింది. తెలంగాణ మెడికల్కౌన్సిల్లో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్చేసుకొని డాక్టర్లుగా చెలమణి అవుతున్న వారిని సైబర్క్రైమ్పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై సైబర్క్రైమ్కేసులు నమోదు చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు. మెడికల్కౌన్సిల్లో పనిచేసే ఉద్యోగి ఒక్కోక్కరి నుంచి రూ. 9 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్చేసినట్లు గురువారం పోలీసులు ప్రకటించారు. ఇలా ఇద్దరి వ్యక్తుల నుంచి వసూళ్లకు పాల్పడినట్టు వెల్లడించారు. టీఎస్మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు.
స్కామ్ జరిగిన తీరు...
కాసరమోని శివానంద్ (32) ఇబ్రహీంపట్నం నివాసీ. ఆయన 2012లో చైనాలోని సౌత్ఈస్ట్యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఆగస్టు 2012 ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్పూర్తి చేసి మన దేశానికి వచ్చే వారికి నిర్వహించే ఎఫ్ఎమ్జీ పరీక్షలో ఫెయిల్‌అయ్యాడు. దీంతో మెడికల్ కౌన్సిల్ఉద్యోగి కందుకూరి అనంతకుమార్‌తో డీల్ కుదుర్చుకొని తప్పుడు పత్రాలు సృష్టించి కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యాడు. 2016 డ్యూటీ డాక్టర్‌గా యశోదా సోమాజీగూడలో పనిచేశారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.
తొటా దిలీఫ్కుమార్చైనాలోని ననతంగ్యూనివర్సిటీ లో ఎంబీబీఎస్పూర్తి చేశారు. ఈయన కూడా ఇండియాలో నిర్వహించే ఎఫ్ఎమ్జీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. కానీ కౌన్సిల్ఉద్యోగితో డీల్కుదుర్చుకొని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2016 నుంచి 2018 వరకు యశోదాలో డ్యూటీ చేశారు. ప్రస్తుతం ఆయన సీనియర్డాక్టర్గా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.
2012, 2014లో ఫెయిల్....
విదేశాల్లో ఎంబీబీఎస్పూర్తి చేసినోళ్లు ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఎఫ్ఎమ్జీఈ(ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్) పాస్‌కావాలి. కానీ వీరిద్దరూ 2012, 2014లో రెండు సార్లు ఫెయిల్ కావడం గమనార్హం. ఎంబీబీఎస్ చేసే సమయంలోనే శివానంద్, దిలీఫ్‌లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారిపోయారు. దీంతో ఇద్దరు కలిసి బ్యాక్ డోరులో రిజిస్ట్రేషన్చేసుకున్నట్లు సైబర్క్రైమ్పోలీసులు తెలిపారు.
ఇలా దొరికారు...?
ప్రతీ ఐదేళ్లకోసారి డాక్టర్లు మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వీరిద్దరూ తొలిసారి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యారు. అయితే రెన్యువల్‌కు అప్లై చేసుకునే సమయంలో అన్ని వివరాలు సరిగ్గా ఇచ్చి, ఫొటోలను తప్పు ఇచ్చారు. దీంతో తప్పును గుర్తించిన రిజిస్టర్ సీహెచ్.హనుమంతరావు ఫిబ్రవరి 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుట్టు రట్టు అయ్యింది.