ఎఫ్‌బీ గ్రూప్స్‌లో ఇష్టమైన 'చానల్స్' సృష్టించుకునే చాన్స్..

దిశ, ఫీచర్స్ : సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ఫేస్‌బుక్‌లోని కమ్యూనిటీ గ్రూప్స్ కోసం ‘చానల్స్’ పేరుతో కొత్త ఫీచర్స్ పరిచయం చేసింది మెటా..Latest Telugu News

Update: 2022-06-29 07:36 GMT

దిశ, ఫీచర్స్ : సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ఫేస్‌బుక్‌లోని కమ్యూనిటీ గ్రూప్స్ కోసం 'చానల్స్' పేరుతో కొత్త ఫీచర్స్ పరిచయం చేసింది మెటా. ఈ మేరకు అడ్మిన్స్ తమ కమ్యూనిటీల్లో మరింత సాధారణ సెట్టింగ్స్‌లోనే వారి సమూహాలతో కనెక్ట్ అయ్యేందుకు మూడు రకాల చానల్స్ సృష్టించవచ్చని మెటా పేర్కొంది. వీటి ద్వారా ఆయా గ్రూప్‌లపై మరింత దృష్టి కేంద్రీకరించే అవకాశముంటుందని తెలిపింది.

గ్రూప్ స్పేస్‌లలో చిన్నపాటి చర్చల కోసం చాట్, ఆడియో, ఫీడ్ వంటి చానల్స్ సృష్టించుకునే అవకాశాన్ని ఈ ఫీచర్ కల్పిస్తుంది. వీటిని ఎఫ్‌బీ గ్రూప్స్‌తో పాటు మెసెంజర్‌లోనూ క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక చాట్‌‌ను సృష్టిస్తే దానికి ఓ పేరు పెట్టవచ్చు. అది ఇన్వైటర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండాలా? లేదా అనేది కూడా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. మీరు చాట్‌లో చేరితే మెసేజ్‌లు పంపడమే కాక నోటిఫికేషన్స్ స్వీకరించగలరు. సభ్యులు మరింత పర్టిక్యులర్‌గా తమ ఆసక్తుల చుట్టూ కనెక్ట్ అయ్యేందుకు అడ్మిన్స్ గ్రూప్‌లోని అంశాల చుట్టూ కమ్యూనిటీలను నిర్వహించవచ్చని Facebook చెబుతోంది. మీరు చేరేందుకు ఆసక్తిచూపే ఫీడ్ చానల్స్‌ను కూడా ఇవి ప్రదర్శిస్తాయి. కమ్యూనిటీ ఆడియో చానల్స్ విషయానికొస్తే.. నిర్వాహకులు, సభ్యులు ఆడియో ద్వారా లోతైన చర్చలు చేసుకోవచ్చని మెటా పేర్కొంది.

ఇక ఫేస్‌బుక్ కొత్త సైడ్‌బార్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది. ఇది వినియోగదారులు తమ అభిమాన గ్రూప్స్‌ను మరింత త్వరగా కనుగొనడంలో సాయపడుతుంది. మీకు ఇష్టమైన సమూహాలను సైడ్‌బార్ పైభాగానికి పిన్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. దీంతో అవి మొదటగా కనిపిస్తాయి. సైడ్‌బార్ యూజర్లకు కొత్త గ్రూప్స్ కనుగొనే లేదా సొంతంగా సృష్టించుకునే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ క్రమంలోనే ఈవెంట్స్, షాప్స్ సహా మరికొన్నింటి లింక్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. 


Similar News