బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుకునేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుకునేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా నిర్ణయంతో డొమెస్టిక్ వాడకంపై యూనిట్‌కు 40-50 పైసలు పెరగనుండగా, ఇతర కేటగిరీలకు యూనిట్‌కు రూపాయి చొప్పున పెరగనుంది. విద్యుత్ ఛార్జీలను 19 శాతం పెంచాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్‌సీ తుది తీర్పును వెల్లడించింది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.