Okinawa: ఒకినావా కంపెనీ షాకింగ్ నిర్ణయం.. అన్ని బైక్‌లు వెనక్కి..
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఒకినావా షాకింగ్ నిర్ణయం తీసుకుంది...Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఒకినావా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఉన్న తన బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది అక్టోబర్ నుండి ఒకినావా స్కూటర్లలో మూడు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు మరణించడం కూడా జరిగింది. దాంతో ప్రజల సంక్షేమం కోసం మార్కెట్‌లో ఉన్న 3,215 బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు ఓకినావా ఆటోటెక్ తెలిపింది. ఒకినావా ఆటోటెక్ మార్చి 2022 లో 8,284 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధిక సంఖ్యలో ఈవీ బైకులను విక్రయిస్తున్న సంస్థలలో 3వ స్థానంలో ఉంది. బ్యాటరీలు వదులుగా ఉన్న కనెక్టర్‌లు లేదా ఏదైనా డ్యామేజ్ కోసం తనిఖీ చేపడతామని ఇండియా అంతటా ఏదైనా ఒకినావా డీలర్‌షిప్‌లలో ఉచితంగా మరమ్మతులు చేస్తారని ఒకినావా తెలిపింది. ఈ క్రమంలో ఇతర ఈవీ వాహనాల సంస్థలు ఇలాంటి సమస్యలకు పరిష్కారం తెలుసుకునేందుకు కష్టపడుతున్నాయి. వీటిలో ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఈవీ, జితేందర్ ఈవీ సంస్థలు ఉన్నాయి.