Dry fruits: రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి డ్రై ఫ్రూట్స్ కూడా ఓ కారణమే..!

డ్రైఫ్రూట్స్ (Dry fruits)ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే.

Update: 2024-12-18 06:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: డ్రైఫ్రూట్స్ (Dry fruits)ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్(Minerals), ప్రొటీన్లు(proteins), విటమిన్లు(vitamins), మొదలైన వివిధ పోషకాలు అందుతాయి. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ తింటే క్యాన్సర్‌(Cancer)ను తరిమికొట్టొచ్చు. టైప్ 2 డయాబెటిస్‌(Type 2 diabetes)ను నియంత్రించవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడం(Weight loss), బరువు పెరగడం(weight gain), ఎముకలను బలోపేతం(Bones strong) చేయడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. కాగా చాలా మంది డ్రైఫ్రూట్స్‌ను ప్రతిరోజూ తింటుంటారు. కానీ రోజూ డ్రై ఫ్రూట్స్ తింటే రక్తంలో కొలెస్ట్రాల్(Cholesterol) పేరుకుపోయే చాన్స్ ఉందని తాజాగా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీడిపప్పు..

డ్రైఫ్రూట్స్‌లో జీడిపప్పు(cashew nut) ఒకటి. నిజానికి వీటిలో కొవ్వు(Fat), కేలరీలు(calories) అధికంగా ఉంటాయి. కాగా ఎక్కువ తీసుకున్నట్లైతే.. వేగంగా వెయిట్ పెరుగుతారని.. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిపై ఎఫెక్ట్ చూపుతుందని చెబుతున్నారు.

బ్రెజిల్ నట్స్..

ఇవి రోజూ తింటే ఆరోగ్య ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. ఈ గింజల్లో సెలీనియం(Selenium) పుష్కలంగా ఉంటుంది. కాగా బ్రెజిల్ నట్స్(Brazil nuts) ఎక్కువగా తింటే బాడీ పెయిన్స్, తలనొప్పి, అలసట వస్తుంది.

పైన్ నట్స్..

పైన్ నట్స్‌(Pine nuts)లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్(Omega 3 fatty acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే శరీరానికి అనేక లాభాలున్నాయి. కానీ అధక మొత్తంలో తీసుకుంటే మాత్రం బరువు పెరగానికి చాన్స్ ఉంటుంది. ఎందుకంటే పైన్ నట్స్‌లో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి.

హాజెల్ నట్స్..

గుండె బలానికి ఎంతో మేలు చేసే వాటిలో హాజెల్ నట్స్(Hazelnuts) ఒకటి. ఇవి షుగర్‌ను అదుపు(Control sugar)లో ఉంచడంలో బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. హాజల్ నట్స్ తింటే బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంతేకాకుండా ఇమ్యూనిటి పవర్(Immunity power) పెరుగుతుంది. కానీ ఇవిప్రతిరోజూ తింటే మాత్రం శరీర బరువు పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు(Cardiac diseases arise) తలెత్తుతాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News