ఆక్సిజన్ వాయువును గుర్తించిందెప్పుడో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: జర్మన్ - స్వీడన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్తగా పిలిచే ‘కార్ల్ విల్ హెల్మ్ షీలే’.. 1780 మార్చి 13న.. Latest Telugu News..
దిశ, వెబ్‌డెస్క్: జర్మన్ - స్వీడన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్తగా పిలిచే 'కార్ల్ విల్ హెల్మ్ షీలే'.. 1780 మార్చి 13న ఆక్సిజన్ కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే 1770లోనే ఈ ప్రయోగం మొదలవగా ఎన్నో అడ్డంకులను దాటుకుని 1780 మార్చి 13న అప్పుడున్న ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో 'కెమికల్ ఆబ్జర్వేషన్ అండ్ ఎక్స్‌పరిమెంట్ ఆన్ ఎయిర్ అండ్ ఫైర్' అనే పేరుతో ప్రచురితమవడంతో వెలుగులోకి వచ్చింది. ఇక షీలే ఆక్సిజన్ కనుగొన్న తర్వాత దానికి 'ఫైర్ ఎయిర్' అని నామకరణం చేయగా.. ఆ వాయువు ఖాళీ సీసాలో అడుగుకు చేరుకుంటుందని, అది గాలికంటే తేలికైనదని వివరించాడు. అంతేకాదు ఆ వాయువు నీటిలో కరగదని, తడిలో రంగులను తొలగిస్తుందనీ, నీలి లిట్మస్ పేపర్‌ను ఎరుపుగా మార్చుతుందని కూడా చెప్పాడు.
అయితే ఈ శాస్త్రవేత్త ఆక్సిజన్‌ను ఆవిష్కరించడంతో పాటు బేరియం, మాంగనీస్ వంటి మూలకాలు కూడా కనుగొన్నాడు. అంతేకాదు రసాయన పదార్థాలైన సిట్రిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, హైడ్రోజన్ సైనైడ్ (ప్రూసిక్ ఆమ్లం జలద్రావణం), హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్‌లను కూడా కనుగొన్నాడు. అయితే వీటన్నింటికన్నా ముందు అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగపడే ముఖ్యమైన పదార్థం 'పాస్ఫరస్'ను 1769లోనే కనుగొనడం విశేషం. స్వీడన్‌లో 43 ఏళ్లకే(1786 మే 21న) మరణించిన ఆయన చనిపోయే రెండు రోజుల ముందు ఒక వితంతువును పెళ్లి చేసుకున్నాడని హిస్టరీ చెప్తోంది.