Shraddha Das : సూర్య ‘కంగువా’ మూవీలో హీరోయిన్ శ్రద్దా దాస్ ఆ పాట పాడిందని తెలుసా..?

. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మూవీస్, సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీ అయింది

Update: 2024-11-10 02:19 GMT
Shraddha Das : సూర్య ‘కంగువా’ మూవీలో హీరోయిన్ శ్రద్దా దాస్ ఆ  పాట పాడిందని తెలుసా..?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ శ్రద్దా దాస్‌ (Shraddha Das) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మూవీస్, సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీ అయింది. ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్ళిన శ్రద్ధ ఇప్పుడు సింగర్ గా కెరీర్లో దూసుకెళ్తుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ఈవెంట్లో పాటలు పాడి అందర్ని అలరించింది. ఇక, అప్పటి నుంచి ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు, ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారిపోయింది.

సూర్య హీరోగా తెరకెక్కిన కంగువ మూవీలో ఓ పాట పాడింది. సూర్య, హీరోయిన్ దిశా పటాని కలర్ ఫుల్ డ్రెస్సులతో డ్యాన్స్ చేస్తూ ఉన్న యోలో పాటను చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. అసలు ఈ పాట పాడింది ఎవరో కాదు .. శ్రద్దా దాస్‌ పాడింది. ఆమె ఇంత బాగా పాడిందా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా నవంబర్ 14 న విడుదల కానుంది. మొత్తానికి, దేవిశ్రీ తో పాటు శ్రద్దా దాస్‌ కూడా బిజీ అయ్యేలానే ఉంది. 

Full View

Tags:    

Similar News