Dhanush, Aishwarya: మాకు కలిసి ఉండాలని లేదు విడాకులు కావాలి.. ఫైనల్ తీర్పు కోసం కోర్టుకు హాజరైన స్టార్ జంట
స్టార్ హీరో ధనుష్ (Dhanush), ఆయన భార్య ఐశ్వర్య (Aishwarya) విడాకుల కేసు విచారణలో తాజాగా చెన్నై (Chennai) ఫ్యామిలీ కోర్టు (Family Court) ఎదుట హాజరయ్యారు.
దిశ, సినిమా: స్టార్ హీరో ధనుష్ (Dhanush), ఆయన భార్య ఐశ్వర్య (Aishwarya) విడాకుల కేసు విచారణలో తాజాగా చెన్నై (Chennai) ఫ్యామిలీ కోర్టు (Family Court) ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడాకులు (divorce) తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అలాగే.. వారు విడిపోవడానికి గల కారణాలను న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న చెన్నై ఫ్యామిలీ కోర్టు ఫైనల్ (final) తీర్పును ఈ నెల 27కి వాయిదా వేసింది. కాగా.. ఈ జంట గత కొద్ది కాలంగా దూరంగా ఉంటూ.. ఎవరి లైఫ్‌ను వారు లీడ్ చేస్తున్నారు. ఐశ్వర్య సినిమాలు తెరకెక్కిస్తుండగా.. ధనుష్ వరుస మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ధనుష్ త్వరలో ‘కుబేర’ (Kubera) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రజెంట్ ధనుష్, ఐశ్వర్య విడాకుల ఇష్యూ వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.