అధికారులపై ఉప సర్పంచ్ ఫైర్.. గ్రామస్తులకేమో మురుగునీరు.. మీకేమో ఫిల్టర్ వాటరా?

దిశ, రామడుగు: మిషన్ భగీరథ అధికారులపై గ్రామ ఉపసర్పంచ్ ఏకంగా గ్రామపంచాయతీలోనే..Deputy Sarpanch hits out at Officers Over Drinking Water

Update: 2022-03-17 08:40 GMT

దిశ, రామడుగు: మిషన్ భగీరథ అధికారులపై గ్రామ ఉపసర్పంచ్ ఏకంగా గ్రామపంచాయతీలోనే నిలదీశాడు. మార్చి 5న మిషన్ భగీరథ నీరు మురుగునీరుగా వస్తుందని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదని ఏకంగా మురుగునీటితో ప్రధాన రహదారిపై గ్రామస్తులు నిరసనకు దిగారు. అట్టి విషయంపై అధికారులు నేడు గ్రామ పంచాయతీకి రావడంతో గుండి ఉప సర్పంచ్ మేడి శ్రీనివాస్ అధికారులను నిలదీశాడు. ఈ క్రమంలో గ్రామస్తులకు భగీరథ నీటిలో మురుగునీరు వస్తున్నదని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని.. ఇప్పుడు మీరు గ్రామపంచాయతీకి వస్తే మాత్రం మీకు ఫిల్టర్ నీళ్లు ఎలా ఇస్తామని గ్రామపంచాయతీలోనే నిలదీశాడు. మరి మిషన్ భగీరథ అధికారులు ఇట్టి విషయంపై ఎలా స్పందిస్తారు చూడాల్సిందే మరి.....!

Tags:    

Similar News