డిప్యూటీ సీఎం సవాల్.. 'జగన్ మళ్లీ సీఎం కాకపోతే ఆస్తులు మెుత్తం రాసిచ్చేస్తా'

దిశ, ఏపీ బ్యూరో : 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని..latest telugu news

Update: 2022-03-19 14:56 GMT
డిప్యూటీ సీఎం సవాల్.. జగన్ మళ్లీ సీఎం కాకపోతే ఆస్తులు మెుత్తం రాసిచ్చేస్తా
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో : 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకపోతే తన ఆస్తులు మెుత్తం రాసిచ్చేస్తానంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం నాడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వచ్చే ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది పొత్తులు పెట్టుకుని వచ్చినా.. ఒంటరిగా వచ్చినా గెలుపు మాత్రం వైసీపీదేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ లాంటి నేత నభూతో నభవిష్యత్ అని అభివర్ణించారు. ఇకపోతే ప్రతి ఎమ్మెల్యే ఇకపై ప్రజల్లో ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సీఎం ఆదేశించారని... పార్టీ అధినేత ఆదేశాలతో తాను ప్రతి ఇంటికి వస్తానని పేర్కొన్నారు.

Tags:    

Similar News