ప్రేమ పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై దారుణానికి ఒడిగట్టిన ప్రియుడు

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిపోయాయి..Latest Telugu News

Update: 2022-06-26 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కొందరు వేధింపులకు గురిచేసి దారుణాలకు పాల్పడితే మరికొందరు ప్రేమను నిరాకరించిందని ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో రాజేష్, భారతీ అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలకు ప్రేమ విషయాన్ని తెలియచేశారు. దానికి ఇరు కుటుంబాలు నిరాకరించారు. దాంతో ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుందామని రాజేష్ అన్నాడు. దానికి భారతీ అంగీకరించలేదు. దీంతో కోపంతో ఉన్న యువకుడు అదును చూసి యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. నడిరోడ్డుపై కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు భారతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఆమెను కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భారతి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. బాధిత యువతీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.


Similar News