నాడు తండ్రి.. నేడు తనయుడు.. ఒకే వయసులో తండ్రి కొడుకుల మరణం
దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని రాంసాగర్ గ్రామంలో పండుగ రోజున
దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని రాంసాగర్ గ్రామంలో పండుగ రోజున విషాదం నెలకొంది. బ్రెయిన్ డెడ్ అయిన కారణంగా వ్యక్తి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన నరాల జలందర్ (34)వృత్తి రీత్యా నాచుపల్లి శివారులోని జేఎన్టీయూ కళాశాలలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన జలంధర్ కి అకస్మత్తుగా స్పృహ కోల్పోయి ఆరోగ్యం క్షీణించడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.
తాను చనిపోతూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాడు..
పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుండి హైదరాబాద్ లోని మరో హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో బ్రెయిన్ డెడ్ అయినట్టు గా వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యులు జలంధర్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. తాను చనిపోయిన కూడా అవయవాలు దానం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపారు జలంధర్.
నాడు తండ్రి.. నేడు తనయుడు..
నిరుపేద కుటుంబం లో కొమురయ్య లక్ష్మి దంపతులకు జన్మించిన జలంధర్ చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యంతో గల్ఫ్ దేశం లోనే మరణించాడు. జలంధర్ తండ్రి కూడా 35 సంవత్సరాల వయసులో మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తున్న జలంధర్ సోదరి వివాహం చేసి సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతుడు జలంధర్ కి భార్య ప్రియ(32) ఇద్దరు కూతుళ్ళు శ్రీ వేద(7), శ్రీ చైత్ర (4) ఉన్నారు. అమ్మ నాన్నకు ఏమైంది అమ్మ.. అంటూ పిల్లలు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.