తేనేటీగల డ్యాన్స్.. రోబోలకు నేర్పిస్తున్న సైంటిస్ట్స్
దిశ, ఫీచర్స్ : ప్రతీ జీవి తమదైన సాంకేతిక భాషలో అదే జాతికి చెందిన మరో జీవితో కమ్యూనికేట్ చేస్తుంది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ప్రతీ జీవి తమదైన సాంకేతిక భాషలో అదే జాతికి చెందిన మరో జీవితో కమ్యూనికేట్ చేస్తుంది. అలానే తేనెటీగలు కూడా వాటి శరీరాలను కదిలించడం ద్వారా ఒకదానికొకటి సమాచారాన్ని చేరవేస్తుంటాయి. ఈ విషయం నుంచి ప్రేరణ పొందిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం.. ఓ రకమైన 'సంజ్ఞ'లను అభివృద్ధి చేసింది. ఈ సంజ్ఞలను రోబోల మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించారు. ఈ పరిశోధన ఫ్రాంటియర్స్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఏఐ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమైంది.
ఒక తేనెటీగ.. తేనె లభించే పువ్వుల పాచ్‌ను కనుగొన్న తర్వాత, ఆ ఆహార వనరు ఎక్కడుందో ఇతర తేనెటీగలకు చెప్పేందుకు 'వాగ్లే డ్యాన్స్' చేస్తుంది. ఆ డ్యా్న్స్ కదలికలు సూర్యునికి అనుగుణంగా దిశను తెలియజేయడంతో పాటు నృత్య వ్యవధి ఆహార వనరు దూరాన్ని సూచిస్తుంది. దీని నుంచి ప్రేరణ పొందిన రీసెర్చర్స్.. విపత్తులు సమయంలో వైర్‌లెస్ నెట్‌వర్క్స్ అందుబాటులో లేని ప్రదేశాల్లో రోబోలు, మానవుల మధ్య ఇదే విధమైన వ్యవస్థను ఉపయోగించవచ్చా? లేదా? అనే కోణంలో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రెండు రోబోలకు డ్యాన్స్‌తో కమ్యూనికేట్ చేసేందుకు ఇదే సాంకేతికతను ఉపయోగించారు.
ప్రయోగం ఎలా చేశారంటే..
ముందుగా ఒక మానవ ఆపరేటర్.. 'ప్యాకేజీ' స్థానాన్ని కలిగి ఉన్న కోడెడ్ సందేశాన్ని తెలియజేసేందుకు చేయి పైకెత్తి లేదా బిగించిన పిడికిలి వంటి సంజ్ఞలను ఉపయోగించాడు. ఈ సిగ్నల్‌ను గుర్తించిన రోబో.. దానిలో ఎన్‌కోడ్ చేసిన పర్యావరణ మ్యాప్ ఆధారంగా ప్యాకేజీ స్థానాన్ని అర్థం చేసుకునేందుకు సందేశాన్ని డీకోడ్ చేసింది. ఆ తర్వాత అదే సమాచారాన్ని డ్యాన్స్ ద్వారా రెండో రోబోకు తెలియజేయగలిగింది. ప్రయోగ సమయంలో 93.33 శాతం సమయాన్ని రోబోలు విజయవంతంగా అన్వయించడం సహా ప్రసారం చేయగలిగాయి. ప్యాకేజీని నిర్వహించే రోబో దాని ఓన్ డెప్త్-సెన్సింగ్ కెమెరాతో వీక్షిస్తున్నందున, ప్యాటర్న్ విన్యాసాన్ని బట్టి ప్యాకేజీ ఏ దిశలో ఉందో నిర్ధారిస్తుంది. అదేవిధంగా ట్రేస్ చేసేందుకు ఎంత సమయం పడుతుందనే విషయం ఆధారంగా ప్రయాణించాల్సిన దూరాన్ని నిర్ణయిస్తుంది. ఇది సూచించిన సమయానికి సూచించిన దిశలో మరో రోబో ప్రయాణిస్తుంది. ఆపై ప్యాకేజీ ఉన్న డెస్టినేషన్‌కు చేరుకున్నాక దాన్ని గుర్తించేందుకు 'ఆబ్జెక్ట్ రికగ్నిషన్ సిస్టమ్'ను ఉపయోగిస్తుంది. ఈ పరిశోధనకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ అబ్రా రాయ్ చౌదరి నాయకత్వం వహించారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో పీహెచ్‌డీ విద్యార్థి కౌస్తుభ్ జోషి.. ప్యాకేజ్ హ్యాండ్లింగ్ రోబోల కోసం ప్రాక్సీలుగా పనిచేసే రెండు రోబోలను ఉపయోగించి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ అభివృద్ధి చేశాడు.
రోబోలు సాధారణంగా వైర్‌లెస్ కమ్యూనికేషన్ సహా వివిధ డిజిటల్ నెట్‌వర్క్స్ ఉపయోగించి ఒకదానికొకటి సంభాషించుకుంటాయి. కానీ నెట్‌వర్క్ కమ్యూనికేషన్స్ అందుబాటులో లేని పరిస్థితులు ఉండవచ్చు. ఉదాహరణకు విపత్తు ప్రాంతాల్లో లేదా స్పేస్‌వాక్స్ సమయంలో రోబో లేబర్ అవసరం. అధ్యయనంలో ఉన్న రోబోలు సంజ్ఞలను గుర్తించేందుకు సాధారణ కెమెరాలను ఉపయోగించినందున, సాంకేతికత స్కేలబిలిటీకి ప్రాబబిలిటీ కలిగి ఉంది. అందువల్ల సాంకేతికతను మరింత కచ్చితమైన, మరింత పటిష్టంగా మార్చే పనిలో ఉన్నాం. తద్వారా ఇది మరింత సంక్లిష్టమైన సందేశాలు, పనులు, సూచనలను తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది.
- అబ్రా రాయ్ చౌదరి, ప్రొఫెసర్