దేవాలయ ఈవో చర్యలను నిరసిస్తూ కౌన్సిలర్ల నిరసన
దిశ,యాదగిరిగుట్ట: యాదాద్రి పునఃప్రారంభం, మహా సంప్రోక్షణ కార్యక్రమానికి స్థానిక పురపాలక latest telugu news..
దిశ,యాదగిరిగుట్ట: యాదాద్రి పునఃప్రారంభం, మహా సంప్రోక్షణ కార్యక్రమానికి స్థానిక పురపాలక ప్రజా ప్రతినిధుల ప్రోటోకాల్ పాటించకపోవడం అవమానకరం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునఃప్రారంభం, మహా సంప్రోక్షణ కార్యక్రమానికి స్థానిక పురపాలక ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ పాటించని ఈవో చర్యలను నిరసిస్తూ.. పురపాలక కార్యాలయం ముందు సిపిఐ కౌన్సిలర్లు బబ్బురి మౌనిక, దండ బోయిన అనిల్, పేర బోయిన పెంటయ్య లు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ ఈవో గీతారెడ్డి కావాలని దురుద్దేశంతోనే ఆహ్వానాలు పంపలేదని తరతరాలుగా దేవాలయం అభివృద్ధిలో స్థానిక ప్రజలు భాగస్వాములు అవుతారని, స్థానిక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ మా దేవాలయ పున:ప్రారంభ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్‌లను ఆహ్వానించకపోవడం స్థానిక పట్టణ ప్రజలను అవమాన పరిచినట్లు అన్నారు. దేవాలయ ఈవో తనకు ముఖ్యమంత్రి అండ ఉందని ఉద్దేశంతోనే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
అంతేకాకుండా దేవాలయ అభివృద్ధికి సహకరించిన పట్టణ ప్రజలకు ప్రత్యక్షంగా ఆలయ పున:ప్రారంభం, మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని స్వయంగా ప్రత్యక్షంగా చూడటానికి వీలు లేకుండా చేశారన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మమ్మల్ని అవమాన పరచి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాలు పడినటువంటి గీతా రెడ్డి పై తక్షణమే ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.